Begin typing your search above and press return to search.

దురంధ‌ర్ 2 (X) టాక్సిక్.. వివాదాల‌తో టెన్ష‌న్ టెన్ష‌న్

రిలీజ్‌కు నెల రోజులే సమయం ఉండటంతో దురంధర్ 2, టాక్సిక్ చిత్రాల చుట్టూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

By:  Sivaji Kontham   |   19 Feb 2026 6:59 PM IST
దురంధ‌ర్ 2 (X) టాక్సిక్.. వివాదాల‌తో టెన్ష‌న్ టెన్ష‌న్
X

దురంధ‌ర్ 2 వ‌ర్సెస్ టాక్సిక్ రికార్డుల‌ గురించి ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. స‌రిగ్గా ఈ రెండు చిత్రాలు నెల‌రోజుల్లో విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఊపిరాడ‌నివ్వ‌ని వివాదాల‌తో న‌లిగిపోతున్నాయి. ఓవైపు దురంధ‌ర్ 2 పై బొంబాయి మున్సిప‌ల్ డిపార్ట్ మెంట్ నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌పై ఫైన్ లు విధించింది. మ‌రోవైపు టాక్సిక్ చిత్రంలో మ‌త‌ప‌ర‌మైన సెంటిమెంట్ల‌ను గాయ‌ప‌రిచార‌ని వివాదం చెల‌రేగింది..

అయితే ఈ రెండు సినిమాలు ఇవ‌న్నీ ప‌రిష్క‌రించుకుని రిలీజ్ కావాల్సి ఉంది. రికార్డుల మాట దేవుడెరుగు.. రిలీజ‌య్యేప్ప‌టికి ఇంకా నిర్మాత‌లు ఎన్ని స‌మ‌స్య‌ల్ని కొని తెచ్చుకుంటారో అర్థం కాని ప‌రిస్థితి ఉంద‌ని అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు.

రిలీజ్‌కు నెల రోజులే సమయం ఉండటంతో దురంధర్ 2, టాక్సిక్ చిత్రాల చుట్టూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దురంధ‌ర్, టాక్సిక్ రెండూ మార్చి 19న ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇంత‌లోనే దురంధర్ 2 పై బీఎంసీ కొరడా ఝ‌లిపించింది. ముంబైలోని A వార్డ్‌లో అనుమతి లేకుండా భవనం టెర్రస్ మీద షూటింగ్ చేయడం, జనరేటర్ వ్యాన్లను వాడినందుకు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సీరియస్ అయింది. నిబంధనల ఉల్లంఘన కారణంగా చిత్ర నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్‌పై 1 లక్ష జరిమానా విధించడంతో పాటు, భవిష్యత్తులో షూటింగ్ అనుమతుల కోసం వారిని బ్లాక్‌లిస్ట్ చేయాలని బీఎంసీ ప్రతిపాదించింది. షూటింగ్ సమయంలో నిప్పు కాగడాలు, మండే పదార్థాలను వాడటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే హెచ్చరించినా మళ్ళీ అదే తప్పు చేయడంతో 25,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా BMC జప్తు చేసింది.

మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌క `టాక్సిక్`పై మతపరమైన వివాదం చుట్టుముట్టింది. టాక్సిక్ టీజర్‌లో సెయింట్ మైఖేల్ ) చిత్రపటాన్ని అవమానకరంగా చూపించారని, క్రిస్టియన్ సెంటిమెంట్లను గాయపరిచారని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేసింది. టీజర్‌లోని కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయని, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదులు అందాయి.

దురంధర్ 2 మేకర్స్ తమ రిలీజ్ డేట్‌ను ముందే ప్రకటించినా.. మర్యాదకైనా తమకు సమాచారం ఇవ్వకుండా అదే డేట్‌ను ఎంచుకోవడంపై హీరో యశ్ అసహనంతో ఉన్నట్లు క‌థ‌నాలొచ్చాయి. దురంధర్ మొదటి భాగం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, టాక్సిక్ పై కూడా 1000 కోట్లు అంత‌కు మించిన వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ చిత్రానికి రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాల మధ్య ఈగో వార్ నడుస్తోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

రిలీజ్‌కు నెల రోజులే ఉన్నా వివాదాల వల్ల రెండు చిత్రాల యూనిట్లు ఇంకా పూర్తిస్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఇది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుందేమోనని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదాలు ఎలా ఉన్నా.. దురంధర్ 2 కు ఉన్న సీక్వెల్ క్రేజ్.. టాక్సిక్ తో యశ్ మూడు ఏళ్ల తర్వాత వస్తున్న ఇంపాక్ట్.. ఈ రెండింటిలో ఏది నెగ్గుతుందనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్.