'ధురంధర్ 2' రన్ టైమ్ ఫస్ట్ పార్ట్‌కి మించా?
ఇండియా వ్యప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ `ధురంధర్ 2`. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పై యాక్షన్ డ్రామా ఇది.
By: Ravindar Gorantla | 28 Feb 2026 6:09 PM ISTఇండియా వ్యప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ `ధురంధర్ 2`. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పై యాక్షన్ డ్రామా ఇది. ఈ మూవీ మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో డబ్బింగ్ కాకపోయినా మౌత్ టాక్ కారణంగా రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు భారీ స్థాయిలో చూశారు. దీంతో ఇప్పుడు పార్ట్ 2ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో ఫస్ట్ పార్ట్ విడుదలై సంచలన విజయం సాధించడంతో సెకండ్ పార్ట్‌పై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి. ఇదే డేట్‌కి యష్ నటిస్తున్న `టాక్సిక్` రిలీజ్ అవుతుండటంతో రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ జరగబోతోంది. ఈ రెండింటిలో ప్రేక్షకులు దేనికి ప్రాధాన్యత నిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యష్ నుంచి నాలుగేళ్ల విరామం తరువాత వస్తున్న సినిమా కావడంతో `టాక్సిక్`పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా `ధురంధర్ 2` కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కారణం ఇండియాపై పాక్ ఎలాంటి కుయుక్తుల్ని పన్నింది. అందు కోసం ఎలాంటి ప్లాన్‌లు వేసిందన్నది ఫస్ట్ పార్ట్‌లో కొంత వరకు చూపించారు. అయితే పార్ట్ 2లో ఏం జరగబోతోందన్నది ప్రతి ఒక్కరినీ ఆసక్తికి గురి చేస్తోంది. పైగా ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లకు పూర్తి భిన్నంగా రియాలిస్టిక్ అంశాల నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో చాలా వరకు ఆడియన్స్ ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన కీలక అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
`ధురంధర్` ఫస్ట్ పార్ట్ రన్ టైమ్ 3 గంటల 34 నిమిషాలు. అయితే తాజా రిపోర్ట్ ప్రకారం `ధురంధర్ 2` రన్ టైమ్ అంతకు మించి అని తెలుస్తోంది. సీక్వెల్ రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలని తెలిసింది. ఫస్ట్ పార్ట్ రన్ టైమ్ మరీ ఇంతా? అని అంతా అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్ రన్ టైమ్ తగ్గే అవకాశం ఉందని భావించారు. కానీ అందరిని షాక్‌కు గురి చేస్తూ `ధురంధర్ 2` రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు లాక్ చేశారని తెలిసి అంతా అవాక్కవుతున్నారు. అంత రన్ టైమ్ వర్కవుట్ అవుతుందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే రీసెంట్‌గా ఈ మూవీపై ఆదిత్యధర్ వైఫ్, నటి యామీ గౌతమ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేయడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేను `ధురంధర్ 2` చూశానని, ఇది ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా అవుతుందని, స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే తనకు కన్నీళ్లు ఆగలేదని, ఆ క్షణం నుంచి తాను దేనిపై దృష్టిపెట్టలేకపోయానని చెప్పడంతో `ధురంధర్ 2` రివేంజ్ అంశాలతో ఊహించిన దానికి మించి ఉంటుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాసి సంచలనాలు సృష్టిస్తుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
