Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్ 2' ఓవ‌ర్సీస్ ప్రింట్ టైమ్‌కి చేరేనా?

ఇప్ప‌టికే పెయిడ్ ప్రీమియ‌ర్స్ బుకింగ్స్ చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ట్రేడ్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

By:  Ravindar Gorantla   |   13 March 2026 7:00 PM IST
ధురంధ‌ర్ 2 ఓవ‌ర్సీస్ ప్రింట్ టైమ్‌కి చేరేనా?
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ స్పై యాక్ష‌న్ డ్రామా `ధురంధ‌ర్ 2`. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో మార్చి 19న విడుద‌ల‌కు రెడీ అవుతున్న పార్ట్ 2పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీనికి నిద‌ర్శ‌న‌మే పెయిడ్ ప్రీమియ‌ర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ సాధిస్తున్న రికార్డ్స్‌. ఇప్ప‌టికే పెయిడ్ ప్రీమియ‌ర్స్ బుకింగ్స్ చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ట్రేడ్‌ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగా `ధురంధ‌ర్ 2` స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు ఇప్ప‌టికే టికెట్స్ బుక్ అయిపోయాయ‌ని, 3.65 మిలియ‌న్‌ల‌కు చేరుకుంద‌ని తెలిస్తోంది. దీంతో ట్రేడ్ వ‌ర్గాలు `ధురంధ‌ర్ 2` ఓపెనింగ్ వ‌సూళ్లతోనే రికార్డుల మోత మోగించ‌డం ఖాయం అని చెబుతున్నారు. అంతే కాకుండా ఇదే జోరు కొన‌సాగితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంద‌ని, ఇండియ‌న్ సినిమాల్లో స‌రికొత్త చ‌రిత్రని తిర‌గ‌రాస్తుంద‌ని అంతా అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఇటీవ‌ల మంబైలోని చారిత్ర క‌ట్ట‌డాల‌లో సినిమా షూటింగ్ కార‌ణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, షూటింగ్‌కు ప‌ర్మీష‌న్ లేద‌ని బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఈ మూవీ షూటింగ్‌ని నిలిపి వేయ‌డ‌మే కాకుండా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీని శాశ్వ‌తంగా బ్లాక్ లిస్ట్‌లో చేర్చ‌డం తెలిసిందే. దీంతో సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. ఫైన‌ల్‌గా సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో అది ఇప్పుడు `ధురంధ‌ర్ 2`కు ఇబ్బందిక‌రంగా మారిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమా ప్రీమియ‌ర్స్‌కు మ‌రో ఐదు రోజులు మాత్ర‌మే ఉండ‌టం, ఓవ‌ర్సీస్ ప్రింట్ డెలివ‌రీకి కూడా అదే స‌మ‌యం ఉండ‌టంతో డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని ఇన్ సైడ్ టాక్‌. భారీ పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్న వేళ సినిమా ప్రింట్‌లు ఆన్ టైమ్‌కు ఓవ‌ర్సీస్‌కు చేర్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న స‌మ‌యం, సినిమా నిడివి కార‌ణంగా ఇది సాధ్య‌మేనా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. టీమ్ ఎంత‌గా వ‌ర్క్ చేస్తున్నా..ముందున్న ప్రెష‌ర్ కార‌ణంగా వ‌ర్క్ మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయని, ఈ గండాన్ని `ధురంధ‌ర్ 2` టీమ్ ఎలా దాటుతారో అని ట్రేడ్ వ‌ర్గాలు, బాలీవుడ్ మేక‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

భారీ సినిమాల‌కు ఈ త‌ర‌హా లాస్ట్ మినిట్ టెన్ష‌న్ అన్న‌ది ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోయింది. నెల‌ల ముందే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేయ‌డం, దానికి త‌గ్గ‌ట్టుగా వ‌ర్క్ సాగ‌క‌పోవ‌డంతో చివ‌రి నిమిషం వ‌ల‌ర‌కు తీవ్రమైన టెన్ష‌న్‌ని ఎదుర్కొన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అదే టెన్ష‌న్‌ని `ధురంధ‌ర్ 2` టీమ్ ఎదుర్కొంటుండ‌టంతో ఓవ‌ర్సీస్ ప్రింట్ టైమ్‌కి చేరేనా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆదిత్య‌ధ‌ర్ ఈ లాస్ట్ మినిట్ టెన్ష‌న్‌ని ఈజీగా క్రాస్ చేసి సినిమాని ఇన్ టైమ్‌కి రిలీజ్ చేస్తారా? అన్న‌ది వేచి చూడాల్సిందే.