Begin typing your search above and press return to search.

'ధురంధర్ 2'.. 'బాహుబలి 2'ను గుర్తు చేసిందిగా!

టాలీవుడ్ మార్కెట్‌ లో లాంగ్ గ్యాప్ తర్వాత ఓ రేంజ్ లో హడావుడి కనిపిస్తోంది. థియేటర్ల వద్ద క్యూల్లో నిలబడటం, ఆన్లైన్ బుకింగ్స్ కోసం పోటీ పడటం వంటి మూమెంట్స్ మళ్లీ తిరిగి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   18 March 2026 8:00 PM IST
ధురంధర్ 2.. బాహుబలి 2ను గుర్తు చేసిందిగా!
X

టాలీవుడ్ మార్కెట్‌ లో లాంగ్ గ్యాప్ తర్వాత ఓ రేంజ్ లో హడావుడి కనిపిస్తోంది. థియేటర్ల వద్ద క్యూల్లో నిలబడటం, ఆన్లైన్ బుకింగ్స్ కోసం పోటీ పడటం వంటి మూమెంట్స్ మళ్లీ తిరిగి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ ఒకే ఒక్క కారణం ధురంధర్ 2. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ ఆ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.

ఆ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ ఫామ్ బుక్‌ మైషో సర్వర్లు క్రాష్ అయినట్లు సమాచారం. ఒకేసారి భారీగా యూజర్లు లాగిన్ అవ్వడంతో వెబ్సైట్, యాప్ పనిచేయడంలో అంతరాయం కలిగింది. మరోవైపు హైదరాబాద్‌ లోని ప్రముఖ థియేటర్ చైన్స్ ఏఎంబీ సినిమాస్, ప్రసాద్ పీసీఎక్స్, అల్లు సినిమాస్ వద్ద టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు అసంతృప్తితో పోస్టులు పెడుతున్నారు.

ఇదే సమయంలో పలువురు వీఐపీలు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు చూసామన్న ప్రశ్నకు ఒకే సమాధానం వినిపిస్తోంది. అదే బాహుబలి 2 విడుదల. 2017లో ఆ సినిమా విడుదలైనప్పుడు ఇలాంటి హడావుడి కనిపించింది. ఆ తర్వాత దాదాపు తొమ్మిదేళ్లకు మళ్లీ ఇలాంటి పరిస్థితి రావడం విశేషం. అయితే ధురంధర్ 2 మూవీకి కనిపిస్తున్న హడావుడికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పాలి.

ముఖ్యంగా ధురంధర్ పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మొదటి భాగం వచ్చిన కొన్ని రోజులకే పార్ట్ -2 రావడం ఇంకో కారణం. హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, భారీ స్థాయిలో చేసిన ప్రమోషన్స్ కూడా హైప్ క్రియేట్ అవ్వడానికి రీజన్స్ గా నిలిచాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, కథలో ఉండే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తోంది.

సినిమా విడుదలకు ముందే ఆ రేంజ్ లో డిమాండ్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే చాలా థియేటర్లలో ఫస్ట్ వీక్ షోలు హౌస్‌ ఫుల్ కావడం విశేషం. కొంతమంది అభిమానులు టికెట్లు దొరకకపోవడంతో బ్లాక్‌ లో కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో హడావుడి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలను సూచిస్తోంది.

సినిమా మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ తో పాటు కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటే, లాంగ్ రన్ లో థియేటర్లలో మూవీ విజయవంతంగా ప్రదర్శితమయ్యే అవకాశముంది. ఏదేమైనా ధురంధర్ 2 సినిమా చుట్టూ ఏర్పడిన క్రేజ్ తెలుగు సినిమా మార్కెట్‌ లో కొత్త ఊపును తీసుకొచ్చింది. గతంలో బాహుబలి 2 సమయంలో కనిపించిన జోష్ ను గుర్తు చేస్తోంది.