'ధురంధర్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వచ్చేస్తోంది!
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మూవీ `ధురంధర్ 2`. ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ వరుస రికార్డుల్ని తుడిచిపెట్టేస్తూ వెళుతోంది. ర
By: Ravindar Gorantla | 1 April 2026 11:45 AM ISTదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మూవీ `ధురంధర్ 2`. ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ వరుస రికార్డుల్ని తుడిచిపెట్టేస్తూ వెళుతోంది. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా గ్లోబల్ పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే కాకుండా మేకింగ్ పరంగా సరికొత్త బెంచ్ మార్క్‌ని సెట్ చేసి ఇండియన్ సినిమాకు సరికొత్త భాష్యం చెబుతోంది.
గత ఏడాది డిసెబర్ 5న విడుదలైన `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రూ.1350 కోట్ల మేర వసూళ్లని రాబట్టి రణవీర్ సింగ్ నటించిన సినిమాల్లో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇది విడుదలైన మూడు నెలల్లోనే`ధురంధర్ ది రివేంజ్`ని మార్చి 19న థియేటర్లలోకి తీసుకొచ్చారు. నిడివి పరంగానూ, కంటెంట్ పరంగానూ హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ విజయ దుందుభి మోగిస్తోంది.
అత్యంత ఫాస్టెస్ట్‌గా రూ.1000 కోట్లు వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుని సాధించి చాలా వరకు మేకర్స్‌కి, స్టార్ హీరోలకు సవాల్ విసిరింది. ఓ పక్క ప్రశంసలు, మరో పక్క విమర్శల నేపథ్యంలో `ధురంధర్ 2` వసూళ్ల సునామీని సృష్టిస్తూ ఇప్పటి వరకు రూ.1434 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని స్పీడు చూస్తుంటే రూ.2000 కోట్ల మార్కుని అవలీలగా మరి కొన్ని రోజుల్లోనే దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే `ధురంధర్` ప్రియులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
డైరెక్టర్స్ కట్ పేరుతో సెన్సార్ కత్తెరకు బలైన మిగతా ఫుటేజ్‌ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్స్ కట్ పేరుతో 7:30 గంటల ఫుటేజ్‌ని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రీమియం స్క్రీన్‌లపై ఈ వెర్షన్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులని మేకర్స్ పూర్తి చేశారని, ఏప్రిల్ 5 నుంచి ఎంపిక చేసిన థియేటర్లలో తాజా ఫుటేజ్‌కు సంబంధించిన వెర్షన్‌ని ప్రదర్శించబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
రెండు భాగాల్లోనూ మితిమిరిన హింస ఉన్న విషయం తెలిసిందే. అయితే 7 గంటల 50 నిమిషాల నిడివి ఇంకా సెన్సార్ చేయకుండా అలాగే ఉందట. దాన్నే ప్రేక్షకుల ముందుకు ప్రత్యేక వెర్షన్‌గా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది రిలీజ్ చేస్తే `ధురంధర్ 2` ప్రస్తుత వెర్షన్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఏమంటారో..వారి ఆలోచన ఏంటన్నది తెలియాలంటే ఆదిత్యధర్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిందే.
