Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్ 2' త‌ప్ప మిగ‌తావి అన్నీషెడ్డుకేనా?

బాక్సాఫీస్ వ‌ద్ద `ధురంధ‌ర్ 2` వ‌సూళ్ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. హిందీ వెర్ష‌న్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఆక‌ట్టుకుంటోంది.

By:  M Prashanth   |   28 March 2026 6:44 PM IST
ధురంధ‌ర్ 2 త‌ప్ప మిగ‌తావి అన్నీషెడ్డుకేనా?
X

బాక్సాఫీస్ వ‌ద్ద `ధురంధ‌ర్ 2` వ‌సూళ్ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. హిందీ వెర్ష‌న్‌తో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1140 కోట్లు రాబ‌ట్టింద‌ని ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 9వ రోజు హిందీ వెర్ష‌న్ రూ.41.55 కోట్లు రాబ‌ట్ట‌గా, తెలుగు వెర్ష‌న్ రూ.2.85 కోట్లు రాబ‌ట్టింది. అయితే త‌మిళ‌నాడులో మాత్రం పెద్ద‌గాప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు విడుద‌లైన తెలుగు సినిమాలు, డ‌బ్బింగ్ మూవీస్ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోతున్నాయి. `ధురంధ‌ర్ 2` రిలీజ్ త‌రువాత వారం గ్యాప్‌తో విడుద‌లైన సినిమాలేవీ పెద్ద‌గా సౌండ్ చేయ‌డం లేదు. ప్ర‌తిదీ యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక ఫ్లాప్‌ల దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు యూత్‌, హ్యాపీరాజ్‌ల‌తో పాటు తెలుగు స్ట్రెయిట్ మూవీ `సుయోధ‌న‌` కూడా విడుద‌లైంది. ఇందులో ప్రియ‌ద‌ర్శి, సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

టీజ‌ర్‌, టైల‌ర్‌ల‌తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమాలేవీ ఇప్పుడు `ధురంధ‌ర్ 2` ముందు నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయి. కంటెంట్ ప‌రంగానూ వీక్‌గా ఉండ‌టంతో ఇవి వ‌సూళ్ల ప‌రంగా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక ఫ్లాపుల జాబితాలో చేరుతున్నాయి. ఇక కోన వెంక‌ట్ ఏరి కోరి `కోర్ట్‌` హిట్ పెయిర్‌తో చేసిన `బ్యాండ్ మేళం` ముందు కొంత ఫ‌ర‌వాలేదు అనిపించినా నెగెటివ్ టాక్ రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. వ‌సూళ్లు కూడా భారీ స్థాయిలో త‌గ్గిపోయి సినిమాపై ప్ర‌తికూల ఫ‌లితాన్ని అందిస్తున్నాయి.

మార్చి 19న ఖ‌చ్చితంగా రావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ `ధురంధ‌ర్‌2`కు పోటీగా చివ‌రి నిమిషంలో బ‌రిలోకి దిగిన `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌` చ‌ర్చ‌లోనే లేకుండా పోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురి చేస్తోది. దీని గురించి ఫ్యాన్స్ త‌ప్ప మ‌రో వ్య‌క్తి మాట్లాడ‌క‌పోవ‌డంతో వ‌సూళ్లు మ‌రీ కిందిస్థాయికి ప‌డిపోయాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మార్చి 19న తెలిసి తెలిసి `ధురంధ‌ర్ 2`కు పోటీగా వేసి త‌ప్పు చేశార‌ని, ఆ సినిమాని త‌క్కువ‌గా అంచ‌నాల వేశార‌ని ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నాయి.

ఇక ప్రియ‌ద‌ర్శి, సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా రూపొందిన `సుయోధ‌న‌` టీజ‌ర్‌తో ఆక‌ట్టుకున్నా..థియేట‌ర్ల‌లో మాత్రం పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌డం లేద‌ని, ఫ్లాప్ దిశ‌గా ప‌య‌నిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఓవ‌రాల్‌గా ఈ వీకెండ్ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింద‌ని, ఈ రేసులో `ధురంధ‌ర్ 2` మాత్రం దూసుకుపోతూ మిగ‌తా వాటిని షెడ్యుకు పంపించేస్తోంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.