Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్' మూవీ ల‌వ‌ర్స్‌కి బిగ్ షాక్‌!

ఫ‌స్ట్ పార్ట్ ఫీవ‌ర్ త‌గ్గ‌కుండానే నెల‌ల వ్య‌వ‌ధిలోనే పార్ట్ 2ని దించేయ‌డంతో ఈ సినిమాపై క్రేజ్ ప‌తాక స్థాయికి చేరుకుని బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించేలా చేస్తోంది.

By:  Ravindar Gorantla   |   23 March 2026 4:14 PM IST
ధురంధ‌ర్ మూవీ ల‌వ‌ర్స్‌కి బిగ్ షాక్‌!
X

ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ధురంధ‌ర్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఫ‌స్ట్ పార్ట్ ఫీవ‌ర్ త‌గ్గ‌కుండానే నెల‌ల వ్య‌వ‌ధిలోనే పార్ట్ 2ని దించేయ‌డంతో ఈ సినిమాపై క్రేజ్ ప‌తాక స్థాయికి చేరుకుని బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టించేలా చేస్తోంది. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత తెలివైన ఎత్తుగ‌డ‌తో రిలీజ్ చేసిన `ధురంధ‌ర్ ది రివేంజ్‌` ఊహించిన దానికి మించి వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఫ‌స్ట్ పార్ట్ రిలీజై నెల గ‌డ‌వక ముందే పార్ట్ 2కు సంబంధించిన వ‌ర్క్‌తో హ‌డావిడి మొద‌లు పెట్టారు.

పార్ట్ 1 ఎండింగ్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌టం, ల్యారీ గ్యాంగ్‌స్ట‌ర్ రెహ‌మాన్ డ‌కాయ‌త్‌ని హ‌త‌మార్చి ఆ స్థానంలోకి రావాల‌ని ప్లాన్ చేసిన హ‌మ్జా ఎలా ల్యారీకి కింగ్‌గా మారాడు? ఆ త‌రువాత ఎలాంటి నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. త‌న‌కు స‌హ‌క‌రించిన చౌద‌రీ అస్లామ్..హ‌మ్జా ల్యారీ కింగ్ కావ‌డానికి స‌హ‌క‌రించాడా?.. ఐఎస్ఐ మేజ‌ర్ ఎక్బాల్ ని హ‌మ్జా ఎలా హ‌త‌మార్చాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు పార్ట్ 2 `ధురంధ‌ర్ ది రివేంజ్‌`లో ఎలా ఉండ‌నున్నాయి? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ ఏర్ప‌డింది. దీంతో పార్ట్ 1కి మించి పార్ట్ 2పై అంద‌రిలో ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఆ క్రేజ్‌కు త‌గ్గ‌ట్టే రాకెట్ స్పీడుతో పార్ట్ 2ని పూర్తి చేసిన ఆదిత్య‌ధ‌ర్ మూడు నెల‌ల్లోనే దీన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అంతే కాకుండా సీక్వెల్స్ విష‌యంలో గ్యాప్ తీసుకుంటే ఎలాంటి న‌ష్ట‌మో.. గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తే ఎంత లాభ‌మో ప్రాక్టిక‌ల్‌గా చేసి చూపించ‌డంతో ఇప్పుడు సీక్వెల్స్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఆదిత్య‌ధ‌ర్‌ని చూసి సీక్వెల్స్ చేసే డైరెక్ట‌ర్లు నేర్చుకోవాల‌ని, సీక్వెల్ పై ఉన్న క్రేజ్‌ని ఎలా వాడుకోవాలో చూపించాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే పార్ట్ 2 త‌ర‌హాలోనే పార్ట్ 3ని కూడా ఆదిత్య‌ధ‌ర్ రాకెట్ స్పీడుతో పూర్తి చేసి థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేస్తాడ‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.అంతే కాకుండా పార్ట్ 3పై భారీ స్థాయిలో చ‌ర్చ చేస్తున్నారు. ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి, అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం స్టోరీని హ‌మ్జా ఎలా ఎండ్ చేశాడు? దీనికి ఎలాంటి అప‌రేష‌న్‌ని నిర్వహించాడు అనే అంశాన్ని పార్ట్ 3లో చూపించే అవ‌కాశం ఉంద‌ని కూడా నెట్టింట చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ `ధురంధ‌ర్‌` ల‌వ‌ర్స్‌కి భారీ షాక్ ఇచ్చాడు.

సీక్వెల్స్‌పై ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 3ని చేసి క్యాష్ చేసుకునే అవ‌కాశం ఉన్నా కానీ ఆదిత్య‌ధ‌ర్ మాత్రం `ది రివేంజ్‌`తో `ధురంధ‌ర్‌` స్టోరీ ఎండ్ అయింద‌ని తేల్చి చెప్ప‌డం ఈ మూవీ ల‌వ‌ర్స్‌ని షాక్‌కు గురి చేసింది. క్రేజ్‌ని క్యాష్ చేసుకోకుండా స్టోరీని ఎక్క‌డ ఎండ్ చేయాలో అక్క‌డ ఎండ్ చేసిన ఆదిత్య‌ధ‌ర్ పార్ట్ 3 లేద‌నితేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. `ధురంధ‌ర్ 3` లేద‌ని ఆదిత్య‌ధ‌ర్ క్లారిటీగా చెన్ప‌డంతో అభిమానులు షాక్‌కు గుర‌వుతున్నారు. పార్ట్ చేసుకునే అవ‌కాశం ఉన్నా కానీ ఆదిత్య‌ధ‌ర్ పార్ట్ 3 లేదంటే లేద‌ని ఫుల్ క్లారిటీతో చెప్ప‌డం అభిమానుల‌కు చేదు వార్తే.