ధురంధర్ 2.. నెక్స్ట్ బిగ్ టార్గెట్స్ అవేనా?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సంచలన రన్ కొనసాగిస్తోంది.
By: M Prashanth | 12 April 2026 10:13 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2: ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సంచలన రన్ కొనసాగిస్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఆ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరెన్నో ఘనతలు సొంతం చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది.
ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో బాహుబలి 2: ది కన్క్లూజన్, పుష్ప 2: ది రూల్ వంటి చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించాయి. అయితే కేవలం హిందీ వెర్షన్ లోనే రూ.1000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ధురంధర్ 2 చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ నుంచి ఇలాంటి ఘనత సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ధురంధర్ 2 కేవలం 21 రోజుల్లోనే రూ.1041 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు ఇప్పటికే రూ.1665 కోట్లు దాటి, ప్రస్తుతం రూ.1700 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్నాయి. ఇందులో ఓవర్సీస్ మార్కెట్ నుంచి మాత్రమే రూ.400 కోట్లకు పైగా రావడం సినిమా అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాకు ఎంతో క్రేజ్ ఉందో తెలుస్తోంది.
ప్రస్తుతం ధురంధర్ 2 బాక్సాఫీస్ రేసులో పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన పుష్ప 2కు ఇది చాలా దగ్గరలో ఉంది. ప్రస్తుత వసూళ్ల ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ వీకెండ్ లోనే ఆ రికార్డును దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే అసలు సవాల్ మాత్రం బాహుబలి 2 రికార్డు. దాదాపు రూ.1790 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ తో ఇప్పటికీ సెకెండ్ ప్లేస్ లో ఉన్న ఆ చిత్రం రికార్డును బ్రేక్ చేయండ అంత సులభం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయినప్పటికీ, ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే ధురంధర్ 2 ఆ రికార్డును కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న జైత్రయాత్ర సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా రన్ ఎక్కడ ఆగుతుందో, ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
ఇక 2025లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ధురంధర్ కు సీక్వెల్ గా వచ్చిన ఆ చిత్రం, కథా బలం, స్టైలిష్ టేకింగ్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రణవీర్ తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మెయిన్ అసెట్స్ గా మారాయి. కీలక పాత్రల్లో నటించిన సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ పాత్రలు కథను ముందుకు నడిపించడంలో కీలకంగా నిలిచాయి.
