Begin typing your search above and press return to search.

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో టాప్ స్కోర‌ర్స్ ఎవ‌రు?

యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌ల‌తో బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి రూ.3450 కోట్లు 16 సినిమాల‌కు గానూ ఈ వ‌సూళ్ల‌ని సాధించిన డైరెక్ట‌ర్‌గా నిలిచాడు.

By:  Ravindar Gorantla   |   25 March 2026 10:22 PM IST
ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో టాప్ స్కోర‌ర్స్ ఎవ‌రు?
X

ఎన‌ర్జీకి మారు పేరుగా నిలిచిన బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ఎల‌క్ట్రిఫైయింగ్ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టిన మూవీ `ధురంధ‌ర్ 2`. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రెగ్యుల‌ర్ పంథాకు పూర్తి భిన్న‌మైన టేకింగ్‌, మేకింగ్ తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తూ రికార్డుల‌ని తిర‌గ‌రాస్తోంది. రూ.1000 కోట్ల క్ల‌బ్‌కు అత్యంత స‌మీపంలోకి చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.934 కోట్లు రాబ‌ట్టిన ఈ మూవీ అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే రూ.1000 కోట్ల మైలు రాయిని దాట‌బోతోంది.

ఈ నేప‌థ్యంలోనే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ఒక్కో డైరెక్ట‌ర్ కౌంట్ ఎంత‌? ఈ లిస్ట్‌లో ఉన్న డైరెక్ట‌ర్లు ఎంత మంది? అందులో జ‌క్క‌న్న స్థానం ఎక్క‌డ‌? ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో టాప్ స్కోర‌ర్స్ ఎవ‌రు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న కూడా నిలిచాడు. మొత్తం 12 సినిమాల‌కు గానూ రాజ‌మౌళి రూ.4140 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించాడు. ఇప్పుడు 13వ సినిమాగా `వార‌ణాసి`ని తెర‌కెక్కిస్తున్నారు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ మూవీ ఇండియన్ సినిమా స‌త్తాని హాలీవుడ్‌కు తెలిసేలా చేయ‌బోతోంది.

యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్‌ల‌తో బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి రూ.3450 కోట్లు 16 సినిమాల‌కు గానూ ఈ వ‌సూళ్ల‌ని సాధించిన డైరెక్ట‌ర్‌గా నిలిచాడు. ఆరు సినిమాల‌తో రాజ్ కుమార్ హిరాణీ రూ.2390 కోట్లుతో 8 సినిమాల‌తో సిద్ధార్ధ్ ఆనంద్ రూ.2480 కోట్ల‌తో నిల‌వ‌గా, కేవ‌లం మూడే మూడు సినిమాల‌తో రూ.2558 కోట్ల‌ని రాబ‌ట్టిన డైరెక్ట‌ర్‌గా లేటెస్ట్ సెన్సేష‌న్ ఆదిత్య‌ధ‌ర్ నిల‌వ‌డం గ‌మ‌నార్హం. త‌న పాన్ ఇండియా సినిమాల‌తో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన డైరెక్ట‌ర్‌గా రాజ‌మౌళి టాప్ పొజీష‌న్‌ని ద‌క్కించుకున్నారు.

కానీ ఆ మొత్తాన్ని వ‌సూలు చేసింది 16 సినిమాల‌తో. కానీ ఆదిత్య‌ధ‌ర్ మాత్రం కేవ‌లం ఉరి, ధురంధ‌ర్‌, ధురంధ‌ర్ 2 సినిమాల‌తోనే రూ.2558 కోట్ల‌ని రాబ‌ట్టిన డైరెక్ట‌ర్‌గా నిలిచి అంద‌రిని వెన‌క్కి నెట్టి అత్యంత త‌క్కువ సినిమాల‌తో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ ప్లేస్‌ని సొంతం చేసుకోవ‌డం విశేషం. ఆ త‌రువాత సెకండ్ ప్లేస్‌ని సిద్ధార్ధ్ ఆనంద్ సొంతం చేసుకుంటున్నాడు. త్వ‌ర‌లో రిలీజ్ కానున్న `కింగ్‌` మూవీ రూ.1000 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టినా ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్ మాత్రం ఆదిత్య‌ధ‌ర్‌దే. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `వార‌ణాసి` రూ.2000 కోట్లు రాబ‌డితే ఈ ప్లేస్‌ల‌లో మార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అంత వ‌ర‌కు ఈ రేసులో ఫ‌స్ట్ ప్లేస్ మాత్రం `ధురంధ‌ర్‌` డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్‌దే కావ‌డం గ‌మ‌నార్హం.