Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్' టీమ్ న్యూ ట్రెండ్‌కి శ్రీ‌కారం చుడుతోందా?

ఓ ప‌క్క మిడిల్ ఈస్ట్‌లో భీక‌ర యుద్ధం జ‌రుగుతుంటే మ‌రో ప‌క్క యావ‌త్ సినీ ప్ర‌పంచం `ధురంధ‌ర్ 2` కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది.

By:  Ravindar Gorantla   |   13 March 2026 1:00 AM IST
ధురంధ‌ర్ టీమ్ న్యూ ట్రెండ్‌కి శ్రీ‌కారం చుడుతోందా?
X

ఓ ప‌క్క మిడిల్ ఈస్ట్‌లో భీక‌ర యుద్ధం జ‌రుగుతుంటే మ‌రో ప‌క్క యావ‌త్ సినీ ప్ర‌పంచం `ధురంధ‌ర్ 2` కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ధురంధ‌ర్‌` గ‌త ఏడాది విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సెల‌బ్రిటీస్‌ని, మేక‌ర్స్‌ని విస్మ‌యానికి గురి చేసింది. దీంతో సీక్వెల్ `ధురంధ‌ర్ ది రివేంజ్‌`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఓ రేంజ్‌లో ఉండ‌టంతో పార్ట్ 2పై కూడా భారీగా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగి హాట్ టాపిక్‌గా మారింది.

సీక్వెల్‌ని మార్చి 19న భారీ స్థాయిలో మేక‌ర్స్ రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌ట‌కే పెయిడ్ ప్రీమియ‌ర్ బుకింగ్స్ ద్వారా రికార్డులు సృష్టిస్తున్న `ధురంధ‌ర్ 2` వ‌రల్డ్ వైడ్‌గా స‌రికొత్త రికార్డుల్ని న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో ఈ సినిమా సాధించ‌బోయే రికార్డ్స్‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. తొలి రోజు ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్‌తో రికార్డుల ఖాతాని తెర‌వ‌డం ఖాయ‌మ‌ని కొంత మంది అప్పుడే ప్రిడిక్ష‌న్ చెప్పేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్, డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ వేసిన ప్లాన్ అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది.

ఈ మూవీ టీమ్ స‌రికొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్టుగా తెలుస్తోంది. మార్చి 19న భారీ స్థాయిలో సీక్వెల్ రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు `ధురంధ‌ర్‌` పార్ట్ 1ని థియేట‌ర్ల‌లోకి మ‌ళ్లీ దించేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా `ధురంధ‌ర్‌`ని మ‌ళ్లీ రిలీజ్ చేయ‌డం వ‌ల్ల పార్ట్ 2 కంటినేష‌న్ ఆడియ‌న్స్‌కి ఈజీగా అర్థ‌మ‌వుతుంద‌ని, దాంతో క‌థ‌లోలీన‌మౌతార‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆ కార‌ణంగానే `ధురంధ‌ర్‌`ని మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి తీసుకొచ్చేస్తున్నార‌ని తెలిసింది.

మేక‌ర్స్ స్టార్ట్ చేస్తున్న న్యూ ట్రెండ్ సీక్వెల్ మూవీస్‌కి స‌రికొత్త ఆయుధంగా మారే అవ‌కాశం ఉంద‌ని, రానున్న రోజుల్లో సీక్వెల్స్‌కి ఇదొక అద‌న‌పు క‌లెక్ష‌న్స్‌ని అందించే ఫార్ములాగా పని చేయ‌డం ఖాయ‌మ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఇది మంచి ఆలోచ‌న అని, ప్రేక్ష‌కులు ఫ‌స్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ కంటిన్యుటీని ఎక్క‌డా మిస్ కాకుండా సీక్వెల్‌ని ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాకుండా సీక్వెల్ సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో మ‌రింత హైప్‌ని ఇద క్రియేట్ చేస్తుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే `ధురంధ‌ర్ 2` చాలా వ‌ర‌కు స‌ర్‌ప్రైజ్‌లు ఇవ్వ‌బోతోంద‌ని, ఇందులో మ‌రిన్ని కొత్త విష‌యాల‌ని, మ‌రింత లోతుగా ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ చెప్ప‌బోతున్నాడ‌ని, దావూద్ ఇబ్బ‌ర‌హ్రీం, ఐఎస్ ఐ కి చెందిన ఇలియాస్ క‌శ్మీరీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాలు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. యామీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ కూడా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.