ధురంధర్ 2.. తెలుగోళ్ల సపోర్ట్ ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ 2 మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
By: M Prashanth | 5 March 2026 12:11 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన ధురంధర్ 2 మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ధురంధర్ 2.. ఫస్ట్ పార్ట్ కు మించిన హిట్ అవుతుందని అంతా హోప్స్ పెట్టుకున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. అదే సమయంలో ఆ చిత్రం, రిలీజ్ కు ముందే అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ హాట్ టాపిక్ గా మారింది.
విడుదలకు ఇంకా సమయం ఉండగానే యూఎస్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ధురంధర్ పార్ట్ 1కు యూఎస్ లో ఓపెనింగ్స్ సుమారు 317 వేల డాలర్లు వచ్చాయి. అయితే ఇప్పటికే ఆ నంబర్ ను సీక్వెల్ క్రాస్ చేసిందని టాక్ వినిపిస్తోంది.
ధురంధర్ 2 అడ్వాన్స్ సేల్స్ ఆ ఫిగర్ ను ఇప్పటికే దాటేశాయని సమాచారం. దీంతో ప్రీమియర్లకు ముందే ఆ రేంజ్ లో సినిమాకు టికెట్లు అమ్ముడవడం చూస్తే మూవీపై బజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ మరింత జోష్ లో జరుగుతున్నాయని సమాచారం. టెక్సాస్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి ప్రాంతాల్లో అప్పుడే షోలు ఫుల్ అవుతున్నాయట.
దీంతో కొన్ని థియేటర్లలో ఎక్స్ ట్రా షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఓవర్సీస్ లో ధురంధర్ 2 మూవీకి తెలుగు ఆడియన్స్ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది. అదే సమయంలో నార్మల్ హిందీ మార్కెట్ సెంటర్లలో కూడా బుకింగ్స్ స్టేబుల్ గా కొనసాగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తుండడంతో, సినిమా అన్ని వర్గాలను ఆకర్షించే అవకాశముంది.
అయితే ఇదే రేంజ్ లో బుకింగ్స్ కొనసాగితే ధురంధర్ 2 మొదటి భాగం కంటే భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రీమియర్ షోల నుంచి భారీ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. యూఎస్ మార్కెట్ లో ఉన్న పాజిటివ్ ట్రెండ్, గ్లోబల్ రిలీజ్ కు మంచి ఊపును ఇస్తుందని చెప్పాలి. ఏదేమైనా అమెరికాలో ధురంధర్ 2కు అమెరికాలో భారీ ఓపెనింగ్స్ అయితే ఖాయం. మరి సినిమా విడుదల తర్వాత ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
