ధ్రువ్ విక్రమ్ ఈసారి మాస్ జాకీ.. నెవ్వర్ బిఫోర్ అనేలా..
అయితే ఈసారి మాత్రం తన స్టైల్ పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందు కనిపించిన దానికంటే మరింత మాస్ లుక్ లో, పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే జాకీ.
By: M Prashanth | 13 Sept 2026 10:30 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకు, యంగ్ అండ్ డైనమిక్ ధ్రువ్ విక్రమ్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం తన స్టైల్ పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందు కనిపించిన దానికంటే మరింత మాస్ లుక్ లో, పవర్ ఫుల్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే జాకీ.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని కరణ్ అరవింద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. జాకీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్ లో యాక్షన్ తో ఉండబోతుందో క్లియర్ గా అర్థమవుతోంది. ధ్రువ్ విక్రమ్ లుక్ కూడా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బ్రౌన్ కలర్ డ్రెస్ లో, కొత్త హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్న ఆయన.. చాలా సీరియస్ లుక్ లో కనిపించారు.
ఇప్పటివరకు చూసిన ధ్రువ్ విక్రమ్ కు పూర్తి భిన్నంగా ఆ లుక్ ఉండటం మూవీపై ఇంట్రెస్ట్ ను పెంచుతోంది. ఫేస్ లో కోపం.. నిలబడిన విధానంలో స్టైల్.. మొత్తంగా చూస్తే ఆ రోల్ లో హీరో చాలా స్ట్రాంగ్ పర్సన్ గా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ చెబుతోంది. ముఖ్యంగా పోస్టర్ లో కనిపించే భారీ పంచ్ ఆ సినిమాకు ఉన్న యాక్షన్ టచ్ ను మరింత చూపిస్తోంది. నో రీటేక్స్ అలోవ్డ్ అనే ట్యాగ్ లైన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటివరకు ధ్రువ్ చేసిన మూవీల్లో స్టోరీ, రోల్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపించింది. కానీ జాకీలో మాత్రం కమర్షియల్ హీరోగా కనిపించబోతున్నారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రోల్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ తోపాటు హీరో రోల్ కూడా స్టైలిష్ గా చూపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ వచ్చింది. మరోవైపు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ కూడా యాక్షన్ స్టోరీకి మరో స్ట్రెంత్ కానుంది.
జాకీ.. మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో నిర్మిస్తున్న నాలుగో సినిమా కావడం మరో స్పెషాలిటీ. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఆ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. ఇక జాకీలో ధ్రువ్ విక్రమ్ కంప్లీట్ కొత్త అవతార్ లో కనిపించబోతున్నట్లే.. మరి ఫస్ట్ లుక్ లోనే ఇంత మాస్ గా కనిపించిన హీరో.. సినిమాలో ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటాడన్నది చూడాలి.
అయితే ధ్రువ్ విక్రమ్ 2019లో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 2022లో వచ్చిన మహాన్ చిత్రంలో తన తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని, పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించారు. అనంతరం దర్శకుడు మారి సెల్వరాజ్ తో బైసన్: కాలమాడన్ స్పోర్ట్స్ డ్రామా చేశారు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ జాకీలో యాక్ట్ చేస్తున్నారు.
