Begin typing your search above and press return to search.

రెండు సినిమాలు తర్వాత ఇదే మొదటి మూవీ అంటున్న స్టార్ సన్..!

ధృవ్ విక్రం కూడా ఈ సినిమా కోసం బాగానే హార్డ్ వర్క్ చేసినట్టు ఉన్నాడు. ఓ పక్క చియాన్ విక్రం కూడా కెరీర్ లో ఈ టైం లో హిట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

By:  Ramesh Boddu   |   7 Oct 2025 9:31 AM IST
రెండు సినిమాలు తర్వాత ఇదే మొదటి మూవీ అంటున్న స్టార్ సన్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం తనయుడు ధృవ్ విక్రం కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆదిత్య వర్మ అనే సినిమా తీసిన అతను ఆ సినిమా సరిగా రాలేదని మళ్లీ వర్మగా మరో అటెంప్ట్ చేశాడు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డికి రీమేక్ గా అది తెరకెక్కింది. వర్మ తర్వాత మహాన్ అంటూ విక్రం, ధృవ్ కలిసి ఒక క్రేజీ అటెంప్ట్ చేశారు. కానీ ఆ సినిమా కూడా అసలేమాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇక ఫైనల్ గా కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి ధృవ్ విక్రం లేటెస్ట్ గా బిసన్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేశాడు.

ధృవ్ తో అనుపమ పరమేశ్వరన్..

బిసన్ సినిమాలో ధృవ్ తో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో ధృవ్ మాట్లాడుతూ తనకు ఇది మొదటి సినిమా అంటూ చెబుతున్నాడు. ముందు తీసిన రెండు సినిమాలు తన ట్రయిల్స్ లా చెబుతున్నాడు ఈ హీరో. బిసన్ తన అఫీషియల్ ఫస్ట్ మూవీ అంటూ ప్రమోట్ చేస్తున్నాడు.

ఇదే విధంగా అఖిల్ ని కూడా అఖిల్, హలో సినిమాలు చేశాక మిస్టర్ మజ్ ను సినిమాకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఐతే అది కూడా ఆశించిన రేంజ్ లో ఆడలేదు. ఇప్పుడు అఖిల్ బాటలోనే ధృవ్ విక్రం కూడా వర్మ, మహాన్ సినిమాలు చేశాక బిసన్ కోసం ఇదే తన తొలి సినిమా అనే రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నాడు. తమిళంలో యూత్ ఆడియన్స్ లో అనుపమకు మంచి ఫాలోయింగ్ ఉంది. డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుపమ బిసన్ కి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు.

చియాన్ విక్రం కూడా హిట్ కోసం..

ధృవ్ విక్రం కూడా ఈ సినిమా కోసం బాగానే హార్డ్ వర్క్ చేసినట్టు ఉన్నాడు. ఓ పక్క చియాన్ విక్రం కూడా కెరీర్ లో ఈ టైం లో హిట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన ఈరోజు కాకపోతే రేపు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో సక్సెస్ అందుకుంటాడు. కానీ తనయుడికి ఒక సాలిడ్ హిట్ పడాలని తండ్రిగా ఆవేదనలో ఉన్నాడు. బిసన్ కోసం ధృవ్ సిన్సియర్ ఎఫర్ట్స్ అతనికి తగిన ఫలితాన్ని అందిస్తుందని అంటున్నారు.

ఆల్రెడీ దీపావళికి ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంది. ధృవ్ బిసన్ కి డ్యూడ్ పోటీ అవుతుంది. ఇక తెలుగు రిలీజ్ ల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా దీపావళి టార్గెట్ తో వస్తున్నాయి.