తెలుగు గైడ్ గా మారిన అనుపమ.. టాలెంట్ కి ఫిదా!
అనుపమ పరమేశ్వరన్, చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ జంటగా నటించిన తాజా మూవీ బైసన్..ఈ మూవీ దివాళి కానుకగా అక్టోబర్ 17న తమిళంలో ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
By: Madhu Reddy | 24 Oct 2025 9:10 PM ISTఅనుపమ పరమేశ్వరన్, చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ జంటగా నటించిన తాజా మూవీ బైసన్..ఈ మూవీ దివాళి కానుకగా అక్టోబర్ 17న తమిళంలో ఇప్పటికే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తమిళంలో హిట్ అవ్వడంతో తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అలా తెలుగులో ఈ సినిమా అక్టోబర్ 24న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో సినిమా విడుదల చేస్తున్నారంటే కచ్చితంగా తెలుగు ప్రసంగించాల్సిందే కదా.. అలా తాజాగా యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూలో ధ్రువ్ విక్రమ్ వచ్చీ రానీ తెలుగుతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ధ్రువ్ విక్రమ్ తమిళంలో నటించిన బైసన్ మూవీ హిట్ కొట్టడంతో ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమ చాట్ షో లో ధ్రువ్ విక్రమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అయితే ఈ చాట్ షోలో ధ్రువ్ విక్రమ్ మాట్లాడే ముందు తన సహనటి అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ సహాయం తీసుకున్నారు. మొదట ధ్రువ్ విక్రమ్ ఇంగ్లీష్ లో మాట్లాడగా.. దాన్ని తన సన్నిహితుడు శౌర్యవ్ తెలుగులోకి అనువదించి చెప్పాడు.. కానీ ఆ తర్వాత అనుపమ ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ధ్రువ్ విక్రమ్ తో అనుపమ తెలుగులోనే మాట్లాడించింది. ప్రతి ఒక్క పదం తెలుగులోనే మాట్లాడించి చిన్న చిన్న తప్పులు ఉన్నా సరే వాటిని సరిదిద్దింది.. అయితే అనుపమ పరమేశ్వరన్ ధ్రువ్ విక్రమ్ కి తెలుగు నేర్పించడం స్కూల్లో చదువు చెప్పినట్లుగా కాకుండా ఒక టూరిస్ట్ గైడ్ల అనిపించింది. మొత్తానికి అయితే మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
అంతేకాదు ధ్రువ్ విక్రమ్ కి తెలుగు బాగా వస్తుందని ఏదో ఒకటి రెండు పదాలు తప్పా మిగతావన్నీ అద్భుతంగా మాట్లాడుతున్నాడని నవ్వుతూ తెలిపింది.ఇక అక్కడక్కడ అనుపమ ధ్రువ్ విక్రమ్ కి తెలుగు మాట్లాడడంలో హెల్ప్ చేయడం జరిగింది. అయితే ధ్రువ్ విక్రమ్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు.. ఆయన లో ఉన్న ఆత్మవిశ్వాసం కొత్తగా చూసేవారికి ఆశ్చర్యంగా అనిపించింది... ధ్రువ్ విక్రమ్ ఇతర భాషను ఎంత గౌరవిస్తారు అనేది ఆయన మాట్లాడిన మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు..
ఇక కబడ్డీ మెయిన్ థీమ్ గా తీసుకొని చేసిన బైసన్ మూవీ కోసం ధ్రువ్ విక్రమ్ ఏకంగా ఏడాదిన్నరకు పైగా కబడ్డీలో శిక్షణ పొందారట. ఒకానొక సమయంలో సినిమాలో నటించడం కంటే ఎక్కువగా కబడ్డీనే ప్రేమించానని బైసన్ మూవీ ప్రమోషన్స్ లో తెలియజేశారు.. అంతేకాదు బైసన్ మూవీ కోసం ధ్రువ్ విక్రమ్ తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడడం తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చింది.ఇక మారి సెల్వరాజ్ బైసన్ మూవీకి దర్శకత్వం వహించారు.
