ధూమ్ 4 కాదన్న తెలుగు స్టార్ ఎవరు..?
నేషనల్ లెవెల్ లో యాక్షన్ ప్రియులందరికీ పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇచ్చిన సినిమా ధూమ్.
By: Ramesh Boddu | 19 Aug 2025 2:59 PM ISTనేషనల్ లెవెల్ లో యాక్షన్ ప్రియులందరికీ పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇచ్చిన సినిమా ధూమ్. 2003 లో వచ్చిన ఈ సినిమా అదిరిపోయే విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. మళ్లీ ధూమ్ 2 కూడా 2013 లో వచ్చి థ్రిల్ చేసింది. ధూమ్ సీరీస్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్కో ఫ్రాంచైజ్ ఆడియన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తుంది. ఐతే త్వరలో ధూమ్ నాలుగో ఫ్రాంచైజ్ కి రెడీ అవుతున్నారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ ధూమ్ 4..
ధూమ్ 4 కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ కాస్టింగ్ ఎంపిక చేస్తుంది. ఆల్రెడీ రణ్ బీర్ కపూర్ ని ఫైనల్ చేశారు. మరో కో స్టార్ కోసం వెతుకుతున్నారు. ఐతే ఆ స్టార్ ని టాలీవుడ్ నుంచి తీసుకోవాలన్న డిస్కషన్ నడుస్తుంది. బాహుబలి తర్వాత తెలుగు స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా స్టార్స్ రేంజ్ కి వెళ్లారు. బాలీవుడ్ స్టార్స్ కి ఈక్వల్ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా అంతా కూడా నేషనల్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ఎన్టీఆర్ వార్ 2 లో ప్లేస్ అయ్యాడు. హృతిక్ రోషన్ తో వార్ 2 లో భాగమయ్యాడు తారక్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. ఐతే ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ధూమ్ 4లో మరో తెలుగు స్టార్ కోసం డిస్కషన్స్ చేస్తున్నారట. ఐతే ఆ తెలుగు స్టార్ మాత్రం నో అని చెప్పేశాడట. యష్ రాజ్ లాంటి సంస్థ అడిగితే నో చెప్పడం ఏంటని అనుకోవచ్చు.. ధూమ్ 4 లో తెలుగు స్టార్ చేస్తే మళ్లీ అది వార్ 2 తరహాలోనే ఉంటుందని భావిస్తున్నాడట.
ఆఫర్ ని తిరస్కరించిన స్టార్..
వార్ 2 కథ స్పై స్టోరీ.. కానీ ధూమ్ ఫ్రాంచైజీ ఒక థీఫ్ స్టోరీ.. ఈ రెండిటికీ తేడా ఉంది. అయినా కూడా ధూమ్ 4 కోసం యష్ రాజ్ ఫిలిమ్స్ ఆఫర్ ని మన తెలుగు స్టార్ సున్నితంగా తిరస్కరించాడట. ఆ స్టార్ ఎవరన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం ధూమ్ 4 కాదనడం మంచి నిర్ణయమే అనేస్తున్నారు.
బాలీవుడ్ సినిమాలో మన స్టార్స్ నటించడం కాదు అక్కడ వాళ్లనే ఇక్కడ సినిమాలకు తీసుకు రావాలన్నది మన మేకర్స్ ఆలోచన. త్వరలో అలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఐతే ఈ కాంబినేషన్స్ కచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తాయని చెప్పొచ్చు.
