ఎవరీ ధీరా రెడ్డి.. లిటిల్ "హార్ట్స్" దోచుకుందిగా!
సాధారణంగా కొంతమంది సెలబ్రిటీలు.. చేసేవి చిన్న పాత్రలే అయినా ఆ పాత్రలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు.
By: Madhu Reddy | 10 Sept 2025 1:08 PM ISTసాధారణంగా కొంతమంది సెలబ్రిటీలు.. చేసేవి చిన్న పాత్రలే అయినా ఆ పాత్రలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఆ పాత్రలే వీరికి మంచి ఇమేజ్ తెచ్చి పెడతాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు హీరోయిన్లుగా.. హీరోలుగా చేయకపోయినా.. తమకి దొరికిన చిన్న పాత్రలతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలుగా మారిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ధీరా రెడ్డి కూడా ఒకరు. 'లిటిల్ హార్ట్స్' మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దీంతో ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అంతేకాదు ఈమె ఇంస్టాగ్రామ్ ఐడి పేజీని కూడా ఓపెన్ చేసి ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఎవరీ ధీరా రెడ్డి.. లిటిల్ హార్ట్స్ మూవీలో అందరి హృదయాలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
90'స్ బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్, తెలుగమ్మాయి శివాని నాగారం జంటగా వచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5వ తేదీన పెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా శివ కార్తికేయన్ 'మదరాసి', అనుష్క 'ఘాటి' వంటి పెద్ద సెలబ్రిటీల చిత్రాల దాటిని కూడా తట్టుకొని చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా.. ఆ రెండు చిత్రాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ చెల్లెలిగా కాసేపు క్యూట్ గా కనిపించి అందరి హార్ట్స్ దోచుకుంది. చిన్నది. దీంతో ఈమె ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈమె ఎవరో కాదు.. ఈమె కూడా తెలుగమ్మాయి. 2018లో మిస్ తెలంగాణ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. క్లాసికల్ డాన్సర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె మోడల్.. నటిగా కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటుంది. అందులో భాగంగానే లిటిల్ హార్ట్స్ సినిమాతో ఇప్పుడు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ధీరారెడ్డి ఇంస్టాగ్రామ్ పేజ్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం పర్ఫెక్ట్ హీరోయిన్ పీస్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు చీర కట్టులో మరొకవైపు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. పైగా ఇంస్టాగ్రామ్ లో కూడా భారీగానే ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ సినిమాతో ఈమెకు ఫాలోవర్స్ కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా చిన్న పాత్ర దొరికినా సరే సరైన పాత్ర పడిందంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకోవచ్చని ఇలాంటి ఎంతోమంది నిరూపిస్తున్నారు.
