Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపుల కేసులో రిమాండుకు టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్

తెలుగు టెలివిజన్‌లోని ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ కొరియోగ్రాఫర్ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

By:  Sivaji Kontham   |   12 Sept 2026 11:09 PM IST
లైంగిక వేధింపుల కేసులో రిమాండుకు టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్
X

తెలుగు టెలివిజన్‌లోని ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ కొరియోగ్రాఫర్ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సినిమా అవకాశాలు కల్పిస్తానని నమ్మించి తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. ఈ సంచలన ఘటన టాలీవుడ్ స‌హా బుల్లితెర వర్గాలలోనూ తీవ్ర కలకలం రేపింది.

బాధితురాలైన యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 9న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి.. ఆ తర్వాత తనను మోసం చేయడంతో పాటు లైంగికంగా వేధించారంటూ ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనకు కేంద్రంగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ గతంలో `ఢీ` షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ రియాలిటీ షోలో పలు సీజన్లలో పాల్గొన్న అత‌డు తన అద్భుతమైన డ్యాన్సింగ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం కంటెస్టెంట్‌గానే కాకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కైవసం చేసుకున్నారు.

ఇది మాత్రమే కాకుండా.. ఇటీవల అత్యంత వైభవంగా ముగిసిన ఫినాలేలోనూ అత‌డు మరోసారి విజేతగా నిలిచి సంచలనం సృష్టించారు. బుల్లితెరపై తిరుగులేని డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎదిగి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ట్యాలెంటెడ్ గ‌య్ ఇలాంటి వివాదంలో అరెస్టు కావడం కెరీర్‌ను తీవ్ర సంక్షోభంలో పడేసింది.

ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం అత‌డిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని.. చట్టపరమైన నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.