Begin typing your search above and press return to search.

హీరోయిన్‌కి క్లోజ్ అవ్వ‌డానికి కొంటె వేషాలు

షోలే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ధర్మేంద్రతో తన ప్రేమకథ ఎలా ప్రారంభమైందో హేమ మాలిని ఒక‌సారి స్వ‌యంగా వెల్ల‌డించారు.

By:  Sivaji Kontham   |   25 Nov 2025 7:00 AM IST
హీరోయిన్‌కి క్లోజ్ అవ్వ‌డానికి కొంటె వేషాలు
X

సెట్లో న‌టీన‌టుల మ‌ధ్య ర్యాపో పెర‌గాలంటే ఏం చేయాలి? షూటింగ్ స‌మ‌యంలో చుట్టూ ఉండేవారిని మ్యానేజ్ చేయాలి. హీరోయిన్ తో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎవ‌రూ త‌మ‌నే ప‌ట్టించుకోకుండా చేయాలి. అలా చేయాలంటే కొంత డ‌బ్బు వెద‌జ‌ల్లాలి. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో తాను క‌న్నేసిన హీరోయిన్ కోసం ఇదే ప‌ని చేసాడ‌ట‌. సెట్లో కొంద‌రికి లంచం ఎర‌వేసి, హీరోయిన్ కి క్లోజ్ అయ్యాడట‌.

హీరోయిన్ తో ఏదైనా క్లోజ‌ప్ సీన్ తీసేప్పుడు, కావాల‌నే ప‌దే ప‌దే ఆ సీన్ ని రిపీటెడ్ గా చిత్రీక‌రించేలా చేసేవాడు. దానికోసం కావాల‌నే ఏదో ఒక‌టి గిరాటేసేవాడు. దానిని తేవ‌డానికి లంచం ఇచ్చేవాడు. అలా డ్రీమ్ గ‌ర్ల్ మ‌న‌సునే దోచేసాడు ఈ హీరోగారు. ఈ క‌థంతా ఎవ‌రి గురించి అంటే నిస్సందేహంగా ధ‌ర్మేంద్ర‌- హేమ‌మాలిని గురించే. ఈ జంట షోలే మొద‌లు చాలా హిట్ సినిమాలలో క‌లిసి న‌టించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ కూడా ఆ రేంజులోనే వ‌ర్కవుటైంది.

1970లో `తుమ్ హసీన్ మై జవాన్` చిత్రీకరణ సమయంలో హేమ అనే మెరుపు వెలుగులోకి వచ్చింది. అప్పటికే పాపుల‌ర్ హీరో ధర్మేంద్ర. భారతీయ సినిమా `డ్రీమ్ గర్ల్` హేమ మాలిని అంటే ప‌డి చచ్చేవాడు. సెట్‌లో త‌న‌తోనే ఎక్కువ సమయం గడపాలని భావించేవాడు. దానిని సాధించడానికి చిన్న చిన్న మార్గాల కోసం వెతుకుతూ స్పాట్ బోయ్స్ కి లంచాలు ఇచ్చేవాడు.

షోలే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ధర్మేంద్రతో తన ప్రేమకథ ఎలా ప్రారంభమైందో హేమ మాలిని ఒక‌సారి స్వ‌యంగా వెల్ల‌డించారు. 1975లో షోలే చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో కొన్ని సన్నివేశాలను పొడిగించడానికి ధర్మేంద్ర చాలా తెలివితక్కువ మార్గాన్ని ఎంచుకున్నాడ‌ని హేమ తెలిపారు. స్పాట్ బోయ్స్ కి డ‌బ్బు ఇచ్చి, కావాల‌నే సీన్ ఆల‌స్యం అయ్యేలా చేసేవారు. హేమ మాలినికి రివాల్వర్ ఎలా ఉపయోగించాలో నేర్పిస్తున్న ఒక సన్నివేశంలో రిఫ్లెక్టర్ పడేయడానికి.. ట్రాలీకి అంతరాయం కలిగించడానికి ప్రతిసారీ బోయ్ కి రూ. 20 చెల్లించాడని ఆరోపించారు. ఇలాంటి డిలే కోసం దాదాపు 2000 సెట్లో ఖ‌ర్చు చేసారు.. అయితే త‌న‌పై ఇష్టంతో ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న ధ‌ర్మేంద్ర‌కు హేమ‌మాలిని పడిపోయాన‌ని చెప్పారు.

అప్ప‌టికే ధ‌ర్మేంద్ర పెళ్ల‌యిన‌వాడు. ప్రకాష్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. దీంతో హేమ‌-ధ‌ర్మేంద్ర‌ కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తూ కేవ‌లం వివాహం చేసుకోవడానికి 1980లో ఇస్లాం మతంలోకి మారారు. ధర్మేంద్ర దిలావర్ ఖాన్ అనే పేరు మార్చుకోగా, హేమ ఐషా బిగా మారింది. ఆ ఇద్ద‌రూ సీక్రెట్ గా నిఖా చేసుకున్నారు. త‌ర్వాత హేమ మూలాల‌ను గౌర‌విస్తూ అయ్యంగారు విధానంలో పెళ్లాడుకున్నారు.