Begin typing your search above and press return to search.

ఆ న‌టుడిని చెంప‌దెబ్బ కొట్ట‌డం నిజ‌మేనా!

బాలీవుడ్ సీనియర్ నటుడు హీ-మ్యాన్ ధర్మేంద్ర - కామెడీ కింగ్ గోవిందాల మధ్య కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘ టన మళ్ళీ నెట్టింట వైరల్ అవుతోంది.

By:  Srikanth Kontham   |   6 May 2026 8:48 PM IST
ఆ న‌టుడిని చెంప‌దెబ్బ కొట్ట‌డం నిజ‌మేనా!
X

బాలీవుడ్ సీనియర్ నటుడు హీ-మ్యాన్ ధర్మేంద్ర - కామెడీ కింగ్ గోవిందాల మధ్య కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘ టన మళ్ళీ నెట్టింట వైరల్ అవుతోంది. 1990లో మహేష్ భట్ దర్శకత్వంలో రిలీజ్ అయిన `ఆవార్గి` సినిమా సెట్స్‌లో ధర్మేంద్ర తన భార్య హేమమాలిని కోసం గోవిందాను అందరి ముందే చెంపదెబ్బ కొట్టారనే వార్త అప్పట్లో పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. అప్ప‌ట్లో మీడియా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఈ విష‌యం ప్రేక్ష‌కుల్లోకి వెళ్ల‌లేదు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ ఎందుకు జరిగిందనే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఈ వివాదానికి ప్రధాన కారణం సినిమా కాస్టింగ్‌లో జరిగిన మార్పులు. తొలుత `ఆవార్గి` సినిమాలో గోవిందా , మీనాక్షి శేషాద్రి మాత్రమే ప్రధాన పాత్రధారులుగా ఎంపిక‌య్యారు. కానీ కథలో మార్పుల కారణంగా దర్శకుడు మహేష్ భట్ నిర్మాత హేమమాలిని కలిసి ప్రాజెక్టులోకి అనిల్ కపూర్‌ను తీసుకొచ్చారు. తనతో పాటు మరొక స్టార్ హీరో సిని మాలో ఉండటం గోవిందాకు ఇష్టం లేదుట‌. దీంతో తన పాత్ర ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన గోవింద‌ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారుట. అయితే గోవిందా సినిమాను వదిలేయడం హేమమాలినికి పెద్ద సమస్యగా మారింది.

ఎందుకంటే అప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ ,డేట్స్ ఖరారైపోయాయి. గోవిందాను ఎంత బ్రతిమాలినా? ఆయన వినకపోవడంతో హేమమాలిని విషయాన్ని తన భర్త ధర్మేంద్ర దృష్టికి తీసుకెళ్లారుట‌. గోవిందాతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆమె కోరారు. దీంతో ధర్మేంద్ర రంగంలోకి దిగి గోవిందాను ఒప్పించే ప్రయత్నం చేశారు.ధర్మేంద్ర తొలుత గోవిందాను పిలిచి నచ్చజెప్పారుట‌. ఒక నటుడిగా ప్రొఫెషనలిజం ముఖ్యమ‌ని నిర్మాత లను ఇబ్బంది పెట్టడం సరికాదని హితవు పలికారుట‌. కానీ గోవిందా తన మొండి వైఖరిని వీడలేదుట‌.

అనిల్ కపూర్ సినిమాలో ఉంటే తాను నటించనని తెగేసి చెప్పేశారుట‌. ధర్మేంద్ర మాటను కూడా కాదనడంతో ఆయనకు విపరీతమైన కోపం వచ్చిందిట‌. దీంతో ఆగ్రహంలో ధర్మేంద్ర నియంత్రణ కోల్పోయి సెట్స్‌లోనే అందరి ముందే గోవిందాను చెంపదెబ్బ కొట్టినట్లు వార్త‌లొచ్చాయి. ఈ ఘటన తర్వాత గోవిందా షాక్‌కు గురయ్యారు. ధర్మేంద్ర వంటి సీనియర్ నటుడి నుండి ఇలాంటి ప్రతిస్పందన ఆయన ఊహించలేదు. అయితే ఈ వార్త మీడియాలో దావానాలా వ్యాపించడంతో ధర్మేంద్ర వెంటనే స్పందించి ఇది కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపారేశారు.

గోవిందాతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసారు. అయినా ఆ సమయంలో సెట్స్‌లో ఉన్న వారు మాత్రం ఈ ఘటన నిజమేనని చెప్పుకుంటారు.

సినీ పరిశ్రమలో ఈగోలు -కాంబినేషన్ల మ‌ధ్య గొడవలు స‌హ‌జం. గోవిందా ఆ తర్వాత అనిల్ కపూర్‌తో కలిసి అదే సినిమాలో నటించారు. ఆ చిత్రం సంగీతపరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.