వారసులకు కాదు బయటి వ్యక్తులకు 5కోట్లు రాసిచ్చాడు
లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇటీవల 89 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Dec 2025 9:29 AM ISTలెజెండరీ నటుడు ధర్మేంద్ర ఇటీవల 89 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబీకులు, పరిశ్రమ వర్గాలకు తీరని లోటు. అయితే ధర్మేంద్ర మరణానంతరం ఆయనకు ఉన్న 450 కోట్ల ఆస్తి కోసం వారసులు తగువులాడుకుంటారని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ హేమమాలిని కుమార్తెలు ఈషా, అహనా తన తండ్రి ఆస్తుల కోసం కోర్టునాశ్రయిస్తారా లేదా? అన్నదానిపై సరైన స్పష్ఠత లేదు. సన్నీడియోల్- బాబి డియోల్ వారి ఇద్దరు సోదరీమణులకు మాత్రమే ధర్మేంద్ర ఆస్తులు చెల్లుతాయి! అన్న ప్రచారం కూడా ఉంది.
అయితే ధర్మేంద్రకు ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ, నా ఊరు నా మనుషులు అనే భావన ఉంది. ఆయన తన స్వస్థలం లుథియానా జిల్లాలోని డాంగో అనే చిన్నగ్రామం. ఈ గ్రామంలో తనకు 2.5 ఎకరాల పొలం ఉంది. దీనిని ధర్మేంద్ర తన కుమారులకు ఈ ఆస్తిని రాసిస్తారని భావిస్తే, అసలు కొడుకులు కానీ, కూతుళ్లకు కానీ ఈ ఆస్తిని రాసివ్వలేదు.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం, లూథియానా జిల్లాలోని డాంగో అనే చిన్న గ్రామంలో ఉన్న ధర్మేంద్ర పూర్వీకుల భూమిని అతడి పిల్లలెవరికీ ఇవ్వలేదు.. అతడి మేనల్లుళ్లకు బహుమతిగా ఇచ్చారు.
ఈ విషయం అభిమానులలో గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ భూమితో ధర్మేంద్రకు ఉన్న దీర్ఘకాల భావోద్వేగ అనుబంధం గురించి తెలియదు. ఆ ఊరు బంధువులు, వారితో అనుబంధం ఎంతో గొప్పది. బంధాలు అనుబంధాలకు విలువనిచ్చే ధర్మేంద్ర అంటే ఆ ఊరి ప్రజలకు కూడా ఎంతో ఇష్టం. ఏం చేసినా ఆ 2.5 ఎకరాల భూమిని తన మేనల్లుళ్లకు రాసిచ్చారు. ఈ భూమి విలువి ఇప్పుడు 5 కోట్లుపై మాటే.
మేనల్లుళ్లకు ఆ భూమిని బదిలీ చేసేందుకు ధర్మేంద్ర ఆ ఊరికి వెళ్లి వచ్చారు. ఆయన ఆ పని చేసిన తర్వాత డాంగో ఊరితో పాటు చుట్టుపక్కల చాలా గ్రామాలలో ధర్మేంద్ర ఉదారత గురించి ముచ్చటించుకున్నారు మట్టి - ఇటుకలతో నిర్మించిన ఒక నిరాడంబరమైన పూర్వీకుల ఇల్లు ధర్మేంద్రకు అక్కడ నేటికీ ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుందని చెబుతారు. దశాబ్దాలుగా అక్కడ నివసించిన బంధువులు ఆస్తిని కాపాడుతూనే ఉన్నారు. ఇది ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్నేళ్లుగా ధర్మేంద్ర చాలాసార్లు ఈ ఊరిని సందర్శించాడని కథనాలొచ్చాయి. 2013లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన అక్కడికి వచ్చినప్పుడు అత్యంత చిరస్మరణీయమైన సంఘటనను అభిమానులు గుర్తు చేసుకుంటారు. ధర్మేంద్ర తన ఊరి మట్టికి నమస్కరించి ముద్దాడి ముందుకు సాగుతారు. దానికోసం ఆయన తన కారు నుండి దిగి, వంగి, తన ప్రాంగణంలోని మట్టిని నుదిటితో తాకుతారు. అలాంటి గొప్ప అనుబంధం ఆ ఊరితో ఆయనకు ఉంది.
