Begin typing your search above and press return to search.

'ధర్మస్థల నియోజకవర్గం' జెన్ జీకి కనెక్ట్ అయ్యే మూవీ: సుమన్ స్పెషల్ ఇంటర్వ్యూ

డైరెక్టర్ సినిమా కోసం కంప్లీట్ గా రెడీగా ఉన్నారని, తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా అన్ని విషయాలను ముందుగానే వివరించారని తెలిపారు సుమన్.

By:  M Prashanth   |   3 Sept 2026 11:16 PM IST
ధర్మస్థల నియోజకవర్గం జెన్ జీకి కనెక్ట్ అయ్యే మూవీ: సుమన్ స్పెషల్ ఇంటర్వ్యూ
X

పొలిటికల్ ఎలిమెంట్స్ తోపాటు సోషల్ మెసేజ్ తో రూపొందిన మూవీ ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఆ సినిమాలో సుమన్, సాయికుమార్, కస్తూరి సహా పలువురు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తుండగా.. మేరుం భాస్కర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కానుండగా, Tupaki.comకు సుమన్, కస్తూరి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చి 48 ఏళ్లు పూర్తయిందని సుమన్ తెలిపారు. ఎప్పుడూ అందరితో మంచి సంబంధాలు కొనసాగించడమే తన లక్ష్యమని చెప్పారు. తనకు రోల్ గురించి పూర్తిగా వివరించిన తర్వాత నచ్చితేనే సినిమా చేస్తానని చెప్పారు. పాత్రను చెప్పిన తర్వాత మార్చితే మాత్రం ప్రశ్నిస్తానన్నారు. ఎంతటి పెద్ద దర్శకుడు అయినా తన విషయంలో ఆ విధానం మారదని తెలిపారు. సినిమా గురించి మాట్లాడే ముందు పూర్తి కథను తెలుసుకుంటానని చెప్పారు. ధర్మస్థల నియోజకవర్గం కథ నచ్చడంతో కొన్ని సినిమాలను వదులుకున్నట్లు వెల్లడించారు.

డైరెక్టర్ సినిమా కోసం కంప్లీట్ గా రెడీగా ఉన్నారని, తన పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా అన్ని విషయాలను ముందుగానే వివరించారని తెలిపారు సుమన్. దర్శకుడి పని విధానం తనకు నచ్చిందని.. టాలీవుడ్ కు మంచి దర్శకుడు వచ్చాడని అనిపించిందని చెప్పిన ఆయన.. సినిమా ఎంతో పవర్ ఫుల్ మీడియా అని అన్నారు. యువత తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించిన సుమన్, డ్రగ్స్‌ కు బానిసైన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను సినిమాలో చూపించినట్లు తెలిపారు.

అలాగే రాజకీయాలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా సినిమాలో ఉన్నాయని చెప్పారు. తమిళనాడు సీఎం విజయ్ చెప్పిన కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ సినిమాలో కనిపిస్తాయని పేర్కొన్నారు. అయితే సినిమా షూటింగ్ గత ఏడాదే పూర్తయిందని స్పష్టం చేసిన సుమన్.. పాటలు, ఫైట్లపై ఆధారపడకుండా కథకు ప్రాధాన్యం ఇచ్చి సినిమాను రూపొందించారని తెలిపారు. మూవీ టీమ్ మొత్తం ఎంతో ఇష్టంతో కష్టపడి పనిచేసిందన్నారు.

ప్రస్తుతం అన్ని రకాల కథలతో సినిమాలు వస్తున్నాయని నటి కస్తూరి తెలిపారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోను దేవుడిలా చూపించేవారని.. ఆ తర్వాత సోషల్ ఎలిమెంట్స్ తో సినిమాలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు హీరోలు స్మగ్లర్ వంటి పాత్రల్లో కూడా కనిపిస్తున్నారని అన్నేారు. . సామాజిక కోణంలో తెరకెక్కిన అరుదైన చిత్రాల్లో ధర్మస్థల నియోజకవర్గం ఒకటని చెప్పారు.

తన రోల్ గురించి మొదట విన్నప్పుడు టీచర్ పాత్ర అనుకున్నానని.. కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని దర్శకుడు చెప్పారని తెలిపారు. ఇప్పటివరకు తాను చేయని తరహాలో రోల్ ఉంటుందని చెప్పారు. తనను ఇప్పటి వరకు హోమ్లీ పాత్రల్లో చూశారని.. కానీ ధర్మస్థల నియోజకవర్గం సినిమాలో పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తానని కస్తూరి అన్నారు. దర్శకుడు ప్రతి విషయంలో కొత్తగా ఆలోచించారని తెలి