Begin typing your search above and press return to search.

రాజకీయం అనేది అడవి లాంటిది.. 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్

సుమన్, సాయికుమార్, వితికా షేరు, వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ 'ధర్మస్థల నియోజకవర్గం'.

By:  M Prashanth   |   29 Aug 2026 12:14 PM IST
రాజకీయం అనేది అడవి లాంటిది.. ధర్మస్థల నియోజకవర్గం ట్రైలర్
X

సుమన్, సాయికుమార్, వితికా షేరు, వరుణ్ సందేశ్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ 'ధర్మస్థల నియోజకవర్గం'. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండగా, మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.




ట్రైలర్ చూస్తుంటే ఇది పక్కా పొలిటికల్ డ్రామా అని అర్థమవుతోంది. "బంగ్లాదేశ్, శ్రీలంకల్లో జరిగిన అల్లర్లు మీకు గుర్తున్నాయా? దేశంలో అంతర్యుద్ధాలు ప్రోత్సహించడం, ప్రభుత్వాలను పడగొట్టడం.. అదే డీప్ స్టేట్ పవర్ అంటే" అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఇది ఒక నియోజకవర్గంలో జరిగే కథ మాత్రమే కాదని, దాని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఈ డైలాగ్ తో హింట్ ఇచ్చారు.




ఇక సాయికుమార్ ఎంట్రీ ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. "ఇది ధర్మస్థలం.. దీని ఇంటి పేరు బైరాజ్. ఇక్కడ మంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యాంగం అన్నీ నేనే" అంటూ ఆయన చెప్పే డైలాగ్ క్యారెక్టర్ లోని పొగరును తెలియజేస్తోంది. "రాజకీయం అనేది మృగాలు ఉండే అడవి లాంటిది, వాటి జోలికి వెళ్లకుండా తప్పించుకుని తిరిగితే ప్రశాంతంగా బతకొచ్చు" అనే డైలాగ్ కూడా కథలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉందని చెబుతోంది.

సుమన్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర లాంటి సీనియర్ నటులందరినీ ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ రాజకీయ చదరంగంలో వితికా షేరు, వరుణ్ సందేశ్ పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. "వాళ్లు ఇచ్చింది పుచ్చుకోవడం కాదు, దేశం మొత్తం మారాలి, అది ఈ ధర్మస్థల నియోజకవర్గం నుంచే మొదలవ్వాలి" అని సుమన్ చెప్పే డైలాగ్ కూడా హైలెట్ అవుతోంది. ఇక ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది.

ఈ ట్రైలర్ కు మహావీర్ ఏలేందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ మాట్లాడుతూ, చంద్రబోస్ గారు ఈ సినిమాకు అద్భుతమైన పాటలు రాశారని, ముఖ్యంగా 'ఆరంభం' అనే పాటలో కథ సారాంశం మొత్తం ఉంటుందని చెప్పారు. లిరిక్ రైటర్ చంద్రబోస్ కూడా, రంగస్థలం తర్వాత తనకు అంత సంతృప్తినిచ్చిన చిత్రం ఇదేనని, ఇందులో వితికకు ప్రతిఘటనలో విజయశాంతి లాంటి పవర్ ఫుల్ రోల్ దక్కిందని ప్రశంసించారు కథ, సంగీతం, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ తో 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం, థియేటర్లలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

ప్రొడ్యూసర్ మేరుం భాస్కర్ కూడా సినిమా షూటింగ్ గురించి ఒక విషయం చెప్పారు. మొత్తం చిత్రాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నామని, ప్యాచ్ వర్క్‌తో కలిపి అదే టైమ్‌లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. కొత్త దర్శకుడు అయినా జై జ్ఞాన ప్రభ కథపై పూర్తి క్లారిటీతో పని చేశారని చెప్పారు. ఇంత మంది సీనియర్ నటులు ఉన్న పొలిటికల్ డ్రామాను అనుకున్న షెడ్యూల్‌లోనే పూర్తి చేయడం టీమ్‌కు మరో ప్లస్‌గా మారింది. ఇక వితికా షేరు ఈ సినిమాతో కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వస్తోంది. ఇటీవల సినిమాలు తగ్గించిన తాను, ఇందులో వచ్చిన పాత్ర వేరుగా ఉండటంతోనే ఒప్పుకున్నానని చెప్పింది. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆమె వివరణ ఇచ్చారు.