ధన్య బాలకృష్ణన్ ఇంటిమేట్ సీన్స్!
బ్యాకప్ లేకపోతే ఇండస్ట్రీలో ఆరంభంలో ఎదుర్కోవాల్సిన అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తెలిపింది.
By: Srikanth Kontham | 28 Oct 2025 7:00 AM ISTధన్య బాలకృష్ణ టాలీవుడ్ కి పరిచయం అసవరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి. హీరోయిన్ స్నేహితురాలి పాత్రల నుంచి మెయిన్ లీడ్ కి ప్రమోట్ అయింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది. వాటికంటే హీరోయిన్ ప్రెండ్ పాత్రలతో బాగా ఫేమస్ అయిన నటి. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో అమ్మడు భాగస్వామ్యం అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది. ధన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అమ్మడు హీరోయిన్ కటౌట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అమ్మడు హైట్..వెయిట్ కి స్టార్ హీరోలకు పర్పెక్ట్ జోడీగా సెట్ అవుతుంది. అయితే హీరోయిన్ గా కొన్ని అవకాశాలను తనకు తానుగానే వదలుకున్నట్లు తాజాగా తెలిపింది. గ్లామర్ రోల్స్ లో నటించకూడదని కండీషన్ పెట్టుకోవడంతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయాలని దర్శక, నిర్మాతలు కండీషన్ పెట్టడంతో హీరోయిన్ గా వచ్చిన చాలా అవకాశాలు వదులుకున్నట్లు తెలిపింది. ఆ సమయంలో ఇంటిమేట్ సీన్స్ అవసరం లేదని చెప్పి ఉంటే తాను స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని ఏమా? అంది. తాను ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి పరిశ్రమకు వచ్చానని..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో ఎదిగినట్లు గుర్తు చేసుకుంది.
బ్యాకప్ లేకపోతే ఇండస్ట్రీలో ఆరంభంలో ఎదుర్కోవాల్సిన అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తెలిపింది. చిన్న పాత్రలతో మొదలైన తన ప్రయాణం కొన్ని సినిమాల్లో మెయిన్ లీడ్స్ పోషించడం వరకూ రావడం గొప్ప విషయంగా పేర్కొంది. సినిమాలంటే తొలుత తన కుటుంబ సభ్యులు నిరాకరించినా? వారిని ఒప్పించి సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. దాదాపు 15 ఏళ్లగా ధన్య బాలకృష్ణ నటిగా కొనసాగుతుంది. `సెవెన్త్ సెన్స్` సినిమాతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ స్నేహితురాలి పాత్రతో పరిచయమైంది.
అందులో హీరో సూర్య కావడంతో తెలుగులోనూ గొప్ప లాంచింగ్ చిత్రంగా మిగిలిపోయింది. అటుపై తెలుగులో `లవ్ ఫెయిల్యూర్` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో మరింత దగ్గరైంది. ఆ మధ్య రిలీజ్ అయిన `ది 100`లో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం `కృష్ణాలీల` లో నటిస్తోంది. ప్రస్తుతం సెట్స్ లో ఉన్న సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
