సైలెంట్ గా ఫినిష్ చేసిన ధనుష్
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ఇటీవలే ఇడ్లీ కడై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనుష్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది
By: Sravani Lakshmi Srungarapu | 5 Oct 2025 1:00 AM ISTకోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ఇటీవలే ఇడ్లీ కడై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనుష్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతుంది. ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇడ్లీ కడై తర్వాత ధనుష్ తన 54వ సినిమాను పోర్ తొళిల్ అనే థ్రిల్లర్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
D54 పోస్టర్లకు మంచి రెస్పాన్స్
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పలు పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ధనుష్54పై అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు మేకర్స్. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ఇషారి కె. గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ధనుష్54
ఇదిలా ఉంటే ధనుష్ 54వ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ధనుష్- విఘ్నేష్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైందని, ఈ మూవీని వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ధనుష్ కు జోడీగా మమిత బైజు
కాగా D54 లో ధనుష్ కు జోడీగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, జయరామ్, సూరజ్, వెంజరమూడు, కేఎస్ రవికుమార్, పృథ్వీ పాండియరాజన్, కుష్మిత, నితిన్ సత్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ సినిమాకు శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజైన పోస్టర్లు మూవీపై ఆసక్తిని బాగా పెంచుతున్నాయి.
