Begin typing your search above and press return to search.

ధనుష్ లైనప్ లో కంటెంట్ ఉన్న మరో తెలుగోడు

స్టార్ హీరో ధనుష్ వాస్తవానికి తమిళ్ హీరో అయినా.. తెలుగులో ఆయనకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది.

By:  M Prashanth   |   5 Sept 2025 10:12 PM IST
ధనుష్ లైనప్ లో కంటెంట్ ఉన్న మరో తెలుగోడు
X

స్టార్ హీరో ధనుష్ వాస్తవానికి తమిళ్ హీరో అయినా.. తెలుగులో ఆయనకు ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. ఇక్కడి ఆడియెన్స్ ఎఫెక్టో ఏమో కానీ, ఆయన తెలుగు డైరెక్టర్లతో ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. ఆవన్నీ ఆయనకు మంచి విజయాన్ని సాధించి పెట్టాయి. 2023లో వెంకీ అట్లూరితో సార్ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాకుండా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు సంపాదించింది.

ఇక ఇటీవల టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో నటించారు. ధనుష్, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయనకు నేషనల్ అవార్డు కూడా రావొ్చ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం కూడా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు ధనుష్ దగ్గరవుతున్నారు. ఇప్పుడు మరోసారి టాలెంటెండ్ తెలుగు దర్శకుడితో పని చేయడానికి ధనుష్ రెడీ అయిపోయారు.

ధనుష్ లైనప్ లో కంటెంట్ ఉన్న మరో తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విరాటపర్వం ఫేమ్ డైరెక్టర్ వేణు ఉడుగులతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. గత వారమే ఇద్దరు స్టోరీ గురించి చర్చించారు. ప్రాజెక్ట్ కూడా కన్ఫార్మ్ అయిపోయింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ రూపొందిస్తుంది. కాగా, విరాటపర్వం, నీది నాదీ ఒకే కథ సినిమాలతో వేణు ఉడుగుల ఇప్పటికే దర్శకుడిగా టాలీవుడ్ లో సత్తా చాటుకున్నారు.

ఇప్పుడు టాలెంటెడ్ ధనుష్ తో సినిమా చేయనున్నారు. ఈ ఇద్దరి కాంబో తలుచుకుంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి. వేణు ఇప్పటికే తెరకెక్కించిన రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీశారు. ఈ క్రమంలో ధనుష్ కోసం ఎలాంటి కథ రాశారు? సినిమా ఎలా ఉండనుందో ఆసక్తి పెరిగిపోతుంది. ఇలా ధనుష్ కొంత కాలంగా తెలుగు దర్శకులతో వరుస సినిమాలు చేయడంతో ఇక్కడి ఆడియెన్స్ కూడా ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారికంగా వివరాలు బయటకు రానున్నాయి.