#గుసగుస.. ఆ ఇద్దరు టాప్ స్టార్లు రాజకీయాల్లోకి?
తమిళ చిత్రసీమకు చెందిన అగ్ర నటీనటులు రాజకీయ రంగానికి రావడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ.
By: Sivaji Kontham | 26 Oct 2026 9:23 AM ISTతమిళ చిత్రసీమకు చెందిన అగ్ర నటీనటులు రాజకీయ రంగానికి రావడం అనేది శతాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ విజయవంతంగా సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికల బరిలో గ్రాండ్ సక్సెసై సీఎం అయిన నేపథ్యంలో.. ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖుల్లో రాజకీయాలపై ఉత్కంఠను పెంచింది. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి చెందిన మరో ఇద్దరు స్టార్స్ ధనుష్, త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సోషల్ మీడియా- అంతర్జాలంలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వీరు పాల్గొన్న కొన్ని పబ్లిక్ ఈవెంట్స్ , సమావేశాలు ఈ గుసగుసలకు మరింత ఊతాన్నిచ్చాయి.
తాజాగా నటి త్రిష తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక ప్రైవేట్ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. సాధారణ సినీ వేడుకలా కాకుండా.. అక్కడ ఈ భామ ప్రత్యక్షమైన విధానం ఒక భారీ పొలిటికల్ రోడ్‌షోను తలపించింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, జనం మధ్య కార్‌పై నుంచి గాల్లో చేయి ఊపుతూ అభివాదం చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జర్నలిస్టులు ``మీరు త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారా?`` అని ప్రశ్నించగా, ఆమె ఏమీ మాట్లాడకుండా కేవలం చిరునవ్వు నవ్వి దాటవేశారు. పొలిటికల్ ఎంట్రీ లేదు అని ఖండించకపోవడంతో ఇక త్రిష ఆరంగేట్రం లాంఛనమేననే సందేహాలు కలిగాయి.
ఇక నటుడు ధనుష్ విషయానికి వస్తే.. చెన్నైలో తన అభిమాన సంఘానికి చెందిన మహిళా విభాగ ప్రతినిధులతో ఒక భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దాదాపు 58 జిల్లాల నుంచి సుమారు 2,500 మందికి పైగా మహిళా ప్రతినిధులు ఈ మీటింగ్‌కు విచ్చేయడం గమనార్హం. దశాబ్దాలుగా నటనలోనే కొనసాగుతున్న ధనుష్.. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మహిళా గ్రూప్‌లతో గ్రౌండ్ లెవల్లో సమావేశం నిర్వహించడంతో ఆయన కూడా రాజకీయ ప్రవేశం కోసం తన మార్గాన్ని (గ్రౌండ్ వర్క్) సుగమం చేసుకుంటున్నాడనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.
ధనుష్ అభిమానులు ఆయన త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయనాయకుడిగా మారాలని తీవ్రంగా ఆశిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లోని ప్రముఖ పార్టీలైన టీవీకే , ఏఐఏడీఎంకే నాయకులు ధనుష్ తమ పార్టీలలోకి వస్తే ఆహ్వానిస్తామని ఇప్పటికే ప్రకటనలు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే కొందరు విశ్లేషకులు, నెటిజన్లు మాత్రం విజయ్ రాజకీయ ప్రవేశం సక్సెస్ అయిందని ప్రతి ఒక్కరూ అదే బాటలో నడవలేరని.. విజయ్ మాస్ ఫాలోయింగ్ వేరే స్థాయి అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతానికి ధనుష్ కానీ, త్రిష కానీ తమ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారు తమ పబ్లిక్ ఈవెంట్లలో రాజకీయ వేదికలపై మాట్లాడకపోయినా.. వారు నిర్వహించిన ఈవెంట్ల శైలి, జనాదరణ .. వ్యూహాత్మక అడుగులు మాత్రం కోలీవుడ్‌లో పొలిటికల్ హీట్‌ను పెంచేసాయి. మునుముందు ధనుష్ కొత్త రాజకీయ పార్టీ పెడతారా లేదా ఏదైనా ఉన్నతమైన రాజకీయ పార్టీలో చేరుతారా అనేది తమిళనాడు వ్యాప్తంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక త్రిష రాజకీయాల్లోకి వస్తే తన స్నేహితుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
