Begin typing your search above and press return to search.

కొడుకుల‌తో తిరుప‌తికి వెళితే పెళ్లి రూమ‌ర్లు ఆగుతాయా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- అందాల న‌టి మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

By:  Sivaji Kontham   |   28 Jan 2026 10:39 PM IST
కొడుకుల‌తో తిరుప‌తికి వెళితే పెళ్లి రూమ‌ర్లు ఆగుతాయా?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- అందాల న‌టి మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల దూరం దూరంగా ఉన్నా ఇవేవీ ఆగ‌డం లేదు. ఆ ఇద్ద‌రూ ఎక్క‌డ ఉన్నా, ఏం చేస్తున్నా ప్ర‌చారం య‌థేచ్ఛ‌గా సాగిపోతోంది. ఇటీవ‌ల కొద్దిరోజులుగా ఈ జంట పెళ్లి గురించి కూడా అడ్వాన్స్ డ్ గాసిప్పులు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తన ఇద్దరు కుమారులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల కొంత‌కాలంగా ధ‌నుష్‌- మృణాల్ పెళ్లి అంటూ ప్ర‌చారం సాగింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ ఠాకూర్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో విజయ్, అజిత్, త్రిష వంటి స్టార్స్ కూడా అతిథులుగా కనిపించారు. అయితే ఇది AI ద్వారా సృష్టించిన ఫేక్ వీడియో అని తేలిపోయింది.

ఫిబ్రవరి 14న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త‌లు వ‌చ్చిన త‌ర్వాత ఈ ఏఐ వీడియో రావ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అయితే ఈ వార్త‌లపై మృణాల్ ఠాకూర్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ఈ గోబెల్స్ ప్ర‌చారంలో ఎలాంటి నిజం లేదని, మృణాల్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నారని స్పష్టం చేశారు. మృణాల్ కూడా ఒక క్రిప్టిక్ పోస్ట్ తో ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

ఈ పెళ్లి పుకార్లు షేక్ చేస్తున్న ఇలాంటి సమయంలోనే ఈ జ‌న‌వ‌రి 28న (బుధవారం ఉదయం) ధనుష్ తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ధనుష్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలో యాత్ర , లింగ తమ తండ్రికి రక్షణగా నిలబడి జనాన్ని తోసుకుంటూ ముందుకు సాగిన వీడియోలు నెటిజనుల‌ మనసు గెలుచుకుంటున్నాయి.

తిరుమ‌లేశుని సంద‌ర్శ‌నంలో తండ్రి కొడుకులు పట్టు వస్త్రాలు ధరించి చాలా నిరాడంబరంగా కనిపించారు. ధనుష్ ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తన పెద్ద కొడుకు యాత్ర చదువులో మంచి మార్కులు సాధించిన సందర్భంలో ఇలా చేసాడు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభంలో ఇలా స్వామివారిని దర్శించుకోవడం ఆయనకు అలవాటు. ఇప్పుడు మృణాల్ తో పెళ్లి వార్త‌ల‌కు చెక్ పెట్టేందుకే ధ‌నుష్ ఇలా చేసాడా? అన్న‌ది ఒక సందిగ్ధ‌త‌. అయితే దీనికి స్పందించే స్థితిలో ధ‌నుష్ లేడు.

అయితే కేవలం AI వీడియో సృష్టించిన భ్రమల వల్ల పెళ్లి వార్తలు పుట్టుకొచ్చాయి తప్ప ధ‌నుష్‌- మృణాళ్ ఠాకూర్ మధ్య అలాంటిదేమీ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొడుకులతో కలిసి తిరుపతి వెళ్లడం అనేది ధనుష్ తన వ్యక్తిగత, ఆధ్యాత్మిక జీవితంలో భాగంగా చేసిన పర్యటనే తప్ప, ఈ రూమర్లకు సమాధానం చెప్పడానికి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ధ‌నుష్ త‌దుప‌రి ప్రాజెక్టులు

ధనుష్ కెరీర్‌లో ప్రస్తుతం చాలా ఆసక్తికరమైన దశ నడుస్తోంది. నటుడిగా, దర్శకుడిగా ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవ‌ల‌ ధనుష్ లైనప్‌లో ఉన్న ముఖ్యమైన సినిమాల వివరాల్లోకి వెళితే.. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా `క‌ర‌` అనే ప్రాజెక్ట్‌ను ధ‌నుష్‌ అధికారికంగా ప్రకటించారు. ఇది విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రాబోతున్న రా అండ్ గ్రిట్టీ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ధనుష్ `కరస్వామి` అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఈ వేస‌విలో విడుద‌ల‌కు రానుంది. స్వ‌ర‌ మాంత్రికుడు ఇళయరాజా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ డ్రీమ్ ప్రాజెక్ట్. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కొన్ని రూమర్స్ వచ్చినా, తాజాగా ఏజీఎస్ ఎంటర్ టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా చేరడంతో పనులు వేగవంతం అయ్యాయి.

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తన మైల్‌స్టోన్ మూవీ (50వ సినిమా) కోసం ధనుష్ సిద్ధమవుతున్నారు. ఇది ఒక భారీ సోషల్ డ్రామాగా ఉండబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కూడా ధనుష్ లైనప్‌లో ఉంది. ఓం రౌత్ ఫేమ్ ఆదిపురుష్ దీనికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. రూసో బ్రదర్స్ దర్శకత్వంలో `అవెంజర్స్: డూమ్స్‌డే`లో ధనుష్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇది మే 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.