Begin typing your search above and press return to search.

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

చెన్నైలో ధనుష్ ‘ఓఎం’ సినిమా చూసి బయటకు వస్తున్న శ్రీలీలను అభిమానులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర ఆమెకు దారి కల్పిస్తూ కనిపించాడు. జనం మధ్య నుంచి శ్రీలీలను బయటకు తీసుకెళ్లేందుకు యాత్ర ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్‌లో అభిమానులతో శ్రీలీల ఫొటోలు కూడా దిగారు.

By:  M Prashanth   |   22 Nov 2026 12:20 AM IST
శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..
X

చెన్నైలో ఓ సినిమా ఫస్ట్ డే షోకు వెళ్లిన శ్రీలీలకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సినిమా పూర్తయ్యాక బయటకు వస్తుండగా అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి చాలామంది దగ్గరకు రావడంతో ముందుకు వెళ్లడం కూడా కష్టమైంది. అయితే ఆ గుంపులో శ్రీలీల పక్కనే కనిపించిన ఓ యువకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలీలకు దారి కల్పిస్తూ జనం మధ్య నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం కనిపిస్తోంది.

ధనుష్ నటించిన 'OM: ఆపరేషన్ మోల్' శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్ర పోషించారు. తొలి రోజు చెన్నైలోని కమలా సినిమాస్‌కు వెళ్లి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. షో జరుగుతున్న సమయంలో అభిమానులను పలకరించారు. థియేటర్‌లో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో కలిసి ఫొటోలకు కూడా పోజులిచ్చారు. కానీ బయటకు వచ్చిన తర్వాత అభిమానుల సంఖ్య పెరగడంతో పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది.

శ్రీలీల పక్కన ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర కూడా ఉన్నాడు. తండ్రి సినిమా చూసేందుకు తమ్ముడు లింగతో కలిసి యాత్ర కూడా కమలా థియేటర్‌కు వచ్చారు. బయట జనం ఎక్కువగా ఉండటంతో శ్రీలీలకు దారి కల్పిస్తూ కనిపించారు. నీలిరంగు షర్ట్‌లో ఉన్న యాత్ర ఆమె పక్కనే నడుస్తూ గుంపును గమనిస్తున్న వీడియోను అభిమానులు షేర్ చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా శ్రీలీలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు సహకరించారు.

నిజానికి యాత్ర, లింగ ఇద్దరూ తండ్రి సినిమాల కార్యక్రమాలకు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో ధనుష్‌తో తిరుమలకు వచ్చినప్పుడు కూడా అభిమానుల రద్దీని ఎదుర్కొన్నారు. అప్పుడు తండ్రికి దగ్గరగా ఉంటూ జనం మధ్య నుంచి బయటకు వెళ్లేందుకు సహకరించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ యాత్ర అలాంటి జాగ్రత్త తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇక శ్రీలీల తెలుగులో వరుస సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమిళంలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. 'ఓఎం'లో ధనుష్‌తో కలిసి నటించడంతో సినిమా విడుదల రోజే థియేటర్‌కు వెళ్లారు. ఈ చిత్రంలో రోజా అనే పాత్రలో కనిపించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం చాలా మంచి అనుభవమని చెప్పారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉందని, ప్రేక్షకులే చూసి తమ అభిప్రాయం చెప్పాలని కోరారు.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన 'ఓఎం'లో మమ్ముట్టి, సాయిపల్లవి, నసీరుద్దీన్ షా కూడా నటించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 20న విడుదలైంది. సినిమాలో ధనుష్ అండర్‌కవర్ ఆఫీసర్‌గా నటించగా, సాయిపల్లవి ఐపీఎస్ అధికారిగా కనిపించారు. ఇక సినిమాకు మొదటి రోజు ఇండియాలో రూ.17.70 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.