రౌడీ బేబీ జంట రిపీట్.. షూటింగ్ అప్పుడే ప్రారంభం!
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'మారి 2' సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Madhu Reddy | 10 Oct 2025 6:00 PM ISTకొన్ని జంటలు తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని కనబరిచి.. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఒకప్పుడు వెంకటేష్ - సౌందర్య , చిరంజీవి - రాధ, బాలకృష్ణ - విజయశాంతి ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ - రష్మిక ఇలా కొన్ని జంటలు అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని కనబరిచి మంచి ప్రేక్షకు ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హిట్ పెయిర్ గా సొంతం చేసుకున్న ధనుష్ - సాయి పల్లవి కూడా వచ్చి చేరారు.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'మారి 2' సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో "రౌడీ బేబీ" పాటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ కి, సాంగ్ కి బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సాయి పల్లవి - ధనుష్ కాంబినేషన్ కి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపుకు ఇప్పుడు తెరపడుతోంది అని చెప్పవచ్చు.
అసలు విషయంలోకి వెళ్తే.. 2018లో మారి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మారి 2 సినిమాలో సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించారు. ఈ సినిమాలో వచ్చిన రౌడీ బేబీ పాట సంచలన విజయం అందుకుంది. అంతేకాదు ఇప్పటికీ ఈ పాటను చాలామంది అభిమానులు ఆస్వాదిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఈ జంటలు సంబంధించిన ఇప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది.అదే.. ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్, సాయి పల్లవి మళ్లీ జతకట్టనున్నారు.
దర్శకుడు మారి సెల్వరాజ్ నటనకు బలమైన స్కోప్ వున్న పాత్రలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. అందులో భాగంగానే రౌడీ బేబీ జంటను తిరిగి తెరపై చూడడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో వీరిద్దరితోనే ఒక అద్భుతమైన కథను తెరపైకి తీసుకురాబోతున్నారట మారి సెల్వరాజ్. నవంబర్ నెలలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి.. వచ్చే ఏడాది 2026 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ కాంబో కోసం అభిమానులు చాలా ఆసక్తి కనబరిస్తున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కుబేర, ఇడ్లీ కడై చిత్రాలతో మంచి విజయం అందుకున్న ఈయన.. తేరే ఇష్క్ మేన్ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. అలాగే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న డి 54 అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈయన హీరో గానే కాకుండా దర్శకుడిగా కూడా చిత్రాలను విడుదలకు ఉంచారు. అందులో భాగంగానే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
సాయి పల్లవి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె హిందీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రంతోపాటు బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న రామాయణం సినిమాలో కూడా నటిస్తోంది.
