సరదాగా చేసిన పనే ఆశీర్వాదమైంది.. అదే శాపం కూడా!
కొన్ని సరదాగా చేసినవి కూడా ఊహించని ఫలితాన్నిస్తాయి. ఆ ఫలితాలు బయటి వాళ్లకే కాదు, ఆ పనులు చేసిన వ్యక్తులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
By: Sravani Lakshmi Srungarapu | 21 Nov 2025 8:00 PM ISTకొన్ని సరదాగా చేసినవి కూడా ఊహించని ఫలితాన్నిస్తాయి. ఆ ఫలితాలు బయటి వాళ్లకే కాదు, ఆ పనులు చేసిన వ్యక్తులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కోలీవుడ్ టాలెంటెడ్ మరియు స్టార్ హీరో ధనుష్ కు కూడా తాను గతంలో చేసిన ఓ పని అలాంటి ఆశ్చర్యాన్నే కలిగించిందని చెప్తున్నారు. ధనుష్ హీరోగా నటించిన త్రీ మూవీలోని కొలెవరి డి సాంగ్ ఏ స్థాయి సక్సెస్ అయిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.
ధనుష్ పాడిన ఈ సాంగ్ ను యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయగానే దేశం మొత్తం ఆ సాంగ్ వైరల్ అయి ఇండస్ట్రీని షేక్ చేసింది. చాలా నార్మల్ ట్యూన్, తమిళ, ఇంగ్లీష్ లిరిక్స్ తో రూపొందిన ఈ సాంగ్ కు ఆడియన్స్ నుంచి నెక్ట్స్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ మీద సోషల్ మీడియాలో రీల్స్, షాట్స్ వస్తూనే ఉంటాయి. ఈ సాంగ్ పై వచ్చిన పేరడీ సాంగ్స్, రీమిక్స్ కూడా కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. దేశం మొత్తాన్ని కుదిపేసిన ఈ సాంగ్ గురించి రీసెంట్ గా ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కామెడీగా చేశా
రీసెంట్ గా దుబాయ్ వెళ్లి అక్కడ వాచ్ వీక్ లో పాల్గొన్న ధనుష్, ఈ సాంగ్ అసలు ఎలా పుట్టింది? అనుకోకుండా ఎలా వైరలైందనే విషయాల్ని వెల్లడించారు. ఈ సాంగ్ ను తాను చాలా కామెడీగా చేసి వదిలేశానని, ఆల్మోస్ట్ ఆ సాంగ్ గురించి మర్చిపోయి, వేరే సాంగ్స్ వర్క్స్ లో బిజీ అయిన టైమ్ లో అనుకోకుండా ఒక రోజు ఆ సాంగ్ ను ఓపెని చేసి వినగానే చాలా నవ్వుకున్నామని చెప్పారు.
రీజనల్ హిట్ అనుకుంటే ఇండియాను షేక్ చేసింది
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు ఓ రోజు సిస్టమ్ లో ఈ సాంగ్ కనిపించడంతో విని ఫన్నీగా ఉందని, ఈ ఫన్ వర్కవుట్ అవుతుందని, కాబట్టి ఓ సారి ట్రై చేద్దామని అనుకుని ఆ సాంగ్ ను రిలీజ్ చేశామని, కొలెవరి డి సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు తమ ఆశ రీజనల్ హిట్ మాత్రమేనని, కానీ అది వైరల్ మార్కెట్ నే రీడిఫైన్ చేయడంతో పాటూ తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చిపెట్టిందన్నారు ధనుష్. ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచి అది తనను వదలడం లేదని, ఆ సాంగ్ నుంచి దూరంగా వెళ్లాలని ఎంత ట్రై చేసినా, అది మాత్రం తనను వెంటాడుతూనే వస్తుందని, ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవడం తనకు మంచి ఆశీర్వాదమని, అలానే శాపం కూడా అని ధనుష కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టంట వైరల్ అవుతున్నాయి.
