Begin typing your search above and press return to search.

పాదాల నొప్పి స‌మ‌స్య‌తో టెన్నిస్ చాంపియ‌న్‌గా.. నాద‌ల్ బ‌యోపిక్‌పై ధ‌నుష్ ఎమోష‌న‌ల్‌!

ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ధనుష్ గతంలో తాను నాదల్ మ్యాచ్‌లు చూస్తూ ఎమోష‌న‌ల్ గా స్పందించిన తీరుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

By:  Sivaji Kontham   |   9 Jun 2026 1:43 PM IST
పాదాల నొప్పి స‌మ‌స్య‌తో టెన్నిస్ చాంపియ‌న్‌గా.. నాద‌ల్ బ‌యోపిక్‌పై ధ‌నుష్ ఎమోష‌న‌ల్‌!
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవ‌ల పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్నాడు. అటు బాలీవుడ్ లోను అత‌డు కొన్ని క్లాసిక్స్ లో న‌టించి మెప్పించాడు. అయితే ధ‌నుష్ ఒక క్రీడాకారుడిని అమితంగా ఫాలో అయ్యేవాడ‌న్న విష‌యం ఇప్పుడు అర్త‌మ‌వుతోంది. అత‌డు తాజాగా టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ జీవితం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన `రఫా` అనే డాక్యుమెంటరీని వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా నాదల్‌ను ఉద్దేశించి ఒక అత్యంత ఉద్వేగభరితమైన సుదీర్ఘ సందేశాన్ని షేర్ చేసారు. టెన్నిస్ కోర్టులో నాదల్ ఎదుర్కొన్న శారీరక సవాళ్లు, అత‌డి మానసిక స్థైర్యం.. ఆట సమయంలో విలక్షణమైన చ‌ప్పుళ్లు, అలవాట్ల వెనుక ఉన్న అసలు అర్థాన్ని ఈ డాక్యుమెంటరీ తనకు తెలియజేసిందని ధనుష్ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ క్రీడా, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత ధనుష్ గతంలో తాను నాదల్ మ్యాచ్‌లు చూస్తూ ఎమోష‌న‌ల్ గా స్పందించిన తీరుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాదల్ కెరీర్ ప్రయాణంలో పడిన కష్టాల పూర్తి నేపథ్యం తెలియకుండా.. గతంలో అత‌డి మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు తాను ఎన్నోసార్లు సహనం కోల్పోయానని ధనుష్ అంగీకరించారు. నాదల్ కోర్టులో ఏదైనా పాయింట్.. సెట్ లేదా మ్యాచ్‌ను కోల్పోయినప్పుడు.. టీవీ వైపు చూస్తూ ``వామోస్ రఫా.. నువ్వు ఇంకా బాగా ఆడి ఉండాల్సింది`` అని లేదా ``నీపై నువ్వు ఎందుకు ఇంత ఒత్తిడి పెంచుకుంటున్నావు?`` అంటూ తాను అరిచిన సందర్భాలను గుర్తుచేసుకుని ఆవేదన చెందారు. క్రీడ కోసం నాదల్ ఎంతగా తపించాడో తెలుసుకున్నప్పుడు తన మనసు భారమైందని చెప్పుకొచ్చారు.

టెన్నిస్ కోర్టులో నాదల్ అనుసరించే కొన్ని విలక్షణమైన అలవాట్లను (రిచువల్స్) ఇప్పుడు తాను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నానని ధనుష్ వెల్లడించారు. మ్యాచ్ ఆడే సమయంలో వాటర్ బాటిళ్లను ఒక క్రమ పద్ధతిలో అమర్చడం.... కోర్టు గీతలను క్లియర్ చేయడం... జుట్టును సర్దుకోవడం... షార్ట్స్‌ను సరిచేసుకోవడం వంటి నాదల్ పద్ధతులు కేవలం మూఢనమ్మకాలు కావని ఆయన స్పష్టం చేశారు. అవి నిరంతరం తన శరీరాన్ని అలసటకు గురిచేసే శారీరక నొప్పులు, ఆందోళన (యాంగ్జైటీ), మానసిక ఒత్తిడిపై నాదల్ జరిపిన అంతర్గత పోరాటంలో భాగాలని ధనుష్ ఈ సందర్భంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో నాదల్ ఎదుర్కొన్న లెక్కలేనన్ని గాయాలను, ముఖ్యంగా అత‌డిని తీవ్రంగా వేధించిన దీర్ఘకాలిక పాదాల సమస్యను (క్రానిక్ ఫుట్ కండిషన్) అధిగమించి టెన్నిస్ శిఖరాగ్రానికి చేరుకున్న తీరును ధనుష్ ఎంతగానో కొనియాడారు. ఆ పాదాల సమస్య కనుక లేకపోయి ఉంటే నాదల్ ఇంకెన్ని అద్భుతాలు సృష్టించేవారో ఊహించడం కూడా అసాధ్యమన్నారు. నొవాక్ జొకోవిచ్‌తో పోలిస్తే 22 వర్సెస్ 24 గ్రాండ్‌స్లామ్‌ల తేడా అనేది చాలా స్వల్పమైన మార్జిన్ అని అభిప్రాయపడ్డారు. గణాంకాలు జొకోవిచ్ వైపు ఉన్నాయని... ఆట విధానం రోజర్ ఫెదరర్‌కు సొంతమని చాలామంది భావించినా.. తన దృష్టిలో మాత్రం రాఫెల్ నాదల్ ఎప్పటికీ ఆల్‌టైమ్ గ్రేట్ (GOAT) అని, ఆయన తన పాలిట `పీనిక్స్` పక్షి లాంటివాడని ధనుష్ స్పష్టం చేశారు.

నెట్‌ఫ్లిక్స్ అందించిన ఈ `రఫా` డాక్యుమెంటరీ మొత్తం నాలుగు భాగాలుగా రూపొందింది. నాదల్ అసాధారణ టెన్నిస్ కెరీర్‌తో పాటు... అత‌డి తెరవెనుక వ్యక్తిగత జీవితం... గతంలో ఎన్నడూ చూడని ఆర్కైవ్స్... 2023లో ఎదుర్కొన్న తీవ్ర గాయాల నుంచి కోలుకుని 2024లో మళ్లీ ప్రొఫెషనల్ కోర్టులోకి అత‌డు ఎలా అడుగుపెట్టారనే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇందులో చూపించారు. అసలు నాదల్ ఇన్ని రకాల నొప్పులను, కష్టాలను భరించడానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. చివరికి అత‌డు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందా లేదా అనే ఆసక్తికరమైన కోణంలో ఈ సిరీస్ సాగుతుంది.