అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!
నటుడు ధనుష్ సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ తనను బాధిస్తుందని అంగీకరించారు. అయితే వాటిని పట్టించుకోకుండా సినిమాలపైనే దృష్టి పెడతానని తెలిపారు. తన సినిమాలపై అసలైన విమర్శకులు కుమారులు యాత్ర, లింగాలేనని, సినిమా నచ్చకపోతే వారు నిక్కచ్చిగా అభిప్రాయం చెబుతారని సరదాగా వెల్లడించారు.
By: Srikanth Kontham | 15 Nov 2026 3:16 PM ISTజీరో టూ హీరో అయినా? హీరో టూ జీరో అయినా? అందరూ ఒకేలా ఉండాలని లేదు. వారి మానసిక పరిపక్వతను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు స్టార్ డమ్ ను తలకెక్కించుకుని విర్రవిగుతూంటే మరికొంత మంది ఎంత స్టార్ డమ్ ఉన్నా? నిగర్విగా ఉండటానికే ఇష్టపడతారు. చాలా మంది రెండవ కోవకి చెందిన వారే ఉంటారు. ఎంత పెద్ద స్టార్ అయినా? ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉండటానికే మొగ్గుచూపుతుంటారు. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ `ఓఎం` ప్రచారంలో తన వ్యక్తిగత జీవితం - ట్రోలింగ్ గురించి ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు.
సోషల్ మీడియాలో తనపై జరిగే ప్రచారాలు.. నెటిజన్ల విమర్శలు తనను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే విషయాలపై స్పందించిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. `తెరే ఇష్క్ మే` సినిమా ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఓ చిన్న ఘటన సోషల్ మీడియాలో ఎంత పెద్ద దుమారాన్ని రేపిందో తెలిసిందే. పబ్లిక్‌లో ధనుష్ ప్యాంట్‌ను ఆయన స్టైలిస్ట్ సర్దుతున్న వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ధనుష్ ని అహంకారి అంటూ ట్రోల్ చేశారు. ఈ వివాదంపై ధనుష్ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. తన స్టైలిస్ట్ కావాలని ఆ పని చేయలేదన్నారు.
ఆమెకు పనిపై ఉన్న అంకితభావమే అందుకు కారణమన్నారు. `కొంచెం నీ పనిభారాన్ని తగ్గించుకోవచ్చుగా కవ్య` అంటూ సరదాగా హెచ్చరించడం నవ్వుల్లో ముంచెత్తింది. ఇలాంటి ట్రోల్స్.. ఫ్యాన్ వార్స్ తనను ఎంతవరకు బాధిస్తాయనే ప్రశ్న ఎదురైనప్పుడు ధనుష్ ఎలాంటి దాపరికం లేకుండా నిజాయితీగా బదులిచ్చారు. `అవి నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవని చెబితే అది కచ్చితంగా అబద్ధమే అవుతుంది. సోషల్ మీడియాలో జరిగే నెగెటివిటీ కచ్చితంగా నన్ను బాధిస్తుంది` అని అంగీకరిస్తాను.
అయితే ఆ విమర్శల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పనిపై మాత్రమే ఏకాగ్రత పెట్టడం అంతకు మించి తెలుసునన్నారు. అయితే తన ఇంట్లోనే అసలైన విమర్శకులు ఉన్నారంటూ ధనుష్ కుమారులు యాత్ర, లింగాల గురించి ఆసక్తికర నిజం బయట పెట్టారు. తన సినిమాలు బాగుంటే ఎలాగో బయటపడిపోతానని.. కానీ సినిమా నచ్చకపోతే మాత్రం కొడుకులు ఇచ్చే రివ్యూలు బ్రూటల్గా ఉంటాయని నవ్వేసారు.
అందుకే ధనష్ సినిమాల గురించి కుమారులను అడగడానికి నిజంగానే భయపడుతుంటానని వెల్లడించారు. సాధారణంగా సెలబ్రిటీలు బయట విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంట్లో విమర్శలు వ్యక్తమైతే మాత్రం సీరియస్ గానే తీసుకుంటారు. మణిరత్నం తన క్రిటిక్ ఎవరు? అంటే భార్య సుహాసిని పేరు చెబుతారు. ఇంతవరకూ మణిరత్నం తీసిన సినిమాలకు సుహాసిని ఇచ్చిన రేటింగ్ లు చాలా తక్కువని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
