Begin typing your search above and press return to search.

'ఓం'తో పాన్ ఇండియా ప్లాన్.. ధనుష్ టార్గెట్ ఇంకాస్త పెద్దదే..

ఒక టైటిల్.. ఒక వీడియో.. కానీ చర్చ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో.. ధనుష్ కొత్త సినిమా ఓం: చాప్టర్-1 ఆఫిషియల్ గా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదేనా ధనుష్ కెరీర్‌ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  M Prashanth   |   27 July 2026 8:36 AM IST
ఓంతో పాన్ ఇండియా ప్లాన్.. ధనుష్ టార్గెట్ ఇంకాస్త పెద్దదే..
X

ఒక టైటిల్.. ఒక వీడియో.. కానీ చర్చ మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో.. ధనుష్ కొత్త సినిమా ఓం: చాప్టర్-1 ఆఫిషియల్ గా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇదేనా ధనుష్ కెరీర్‌ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరోవైపు ఆ టైటిల్ నే సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అనే ఆసక్తి కూడా ఫ్యాన్స్ లో పెరుగుతోంది.

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, అమరన్ తో బ్లాక్‌ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్‌ కుమార్ పెరియసామి కాంబోలో వస్తున్న ఆ చిత్రం ఇప్పటికే కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారింది. దీనికి మెయిన్ రీజన్.. మూవీ టీమ్ చేస్తున్న కామెంట్స్. ధనుష్ సన్నిహితులు, నిర్మాతలు, దర్శకుడు.. అందరూ ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది సాధారణ సినిమా కాదని, ధనుష్ కెరీర్‌ లోనే అత్యధిక బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ అని చెబుతున్నారు.

ఇక టైటిల్ విషయానికొస్తే.. ఓం అనేది ఇండియన్ కల్చర్ లో ఎంతో పవిత్రమైన పదం. అయితే దర్శకుడు రాజ్‌ కుమార్ పెరియసామి మాత్రం ఇది కేవలం డివోషన్ కు సంబంధించిన పేరు కాదని, కథలోని అనేక యాంగిల్స్ ను రిఫ్లెక్ట్ చేసే టైటిల్ అని వెల్లడించారు. అంతేకాదు.. చిత్రానికి చాప్టర్-1 అని జత చేయడం మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది. అంటే, ఫ్యూచర్ లో ఆ కథకు మరిన్ని భాగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ధనుష్ గత కొన్నేళ్లుగా తన కెరీర్‌ ను పాన్ ఇండియా రేంజ్ లో ఎలాబొరేట్ చేస్తున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఆయన తన ముద్ర వేస్తున్నారు. అలాంటి సమయంలో ఓం ప్రాజెక్ట్‌ ను ఎంచుకోవడం వెనుక క్లియర్ ప్లాన్ కనిపిస్తోందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి విభిన్న భాషల నటీనటులను ఒకే చిత్రంలో తీసుకోవడం పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తీసుకున్న నిర్ణయంగానే భావిస్తున్నారు.

ఇక దర్శకుడు రాజ్‌ కుమార్ పెరియసామి సినిమాకు పెద్ద బలంగా మారారు. అమరన్ విజయంతో ఆయనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటి సమయంలో ధనుష్‌ తో యాక్షన్ డ్రామాను తెరకెక్కించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయిందని, త్వరలో టీజర్, రోల్స్ ఇంట్రడక్షన్ వీడియోలు, ట్రైలర్ విడుదల కానున్నాయని మూవీ టీమ్ ప్రకటించింది. యువ సంచలనం సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరోవైపు ఓం టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. విడుదలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ సినిమా చుట్టూ భారీ హైప్ ఏర్పడిందని అర్థమవుతోంది. ఏదేమైనా ఓం కేవలం మరో ధనుష్ సినిమా కాదు. ఆయన పాన్ ఇండియా జర్నీలో కొత్త మైల్ స్టోన్ గా నిలిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. మరి ఓం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? చాప్టర్-1తో మొదలైన ఆ కథ ఎంత దూరం వెళ్తుంది? అన్న ప్రశ్నలకు ఆన్సర్ దొరకాలంటే అక్టోబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.