లేడీ ఓరియేంటెడ్ చిత్రంతో నయా స్టార్!
కోలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ ధనుష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు.
By: Srikanth Kontham | 22 April 2026 9:00 PM ISTకోలీవుడ్ మల్టీ ట్యాలెంటెడ్ ధనుష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. నటుడిగా అందనంత ఎత్తులో ఉంటే? దర్శకుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఆయన ఆలోచనల్ని ఎంతో వినూత్నంగా ఉండటంతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. అదే ప్రతిభ అతడిని జాతీయ అవార్డు గ్రహీతను సైతం చేసింది. తాజాగా ధనుష్ మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు.
ఓ భారీ లేడీ ఓరియంటెడ్ చిత్రం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసే ఆలోచనలో ధనుష్ ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
సినిమా నేపథ్యం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. 1960-70ల కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా సాగుతుందని సమాచారం. ఆనాటి సంప్రదాయాలు, కట్టుబాట్లు , గ్రామీణ దేవత చుట్టూ తిరిగే భావోద్వేగ పూరితమైన కథాంశంతో చిత్రం ఉండబోతోందని వార్తలొస్తున్నాయి. ధనుష్ మేకింగ్ స్టైల్‌తో ఆ పాతకాలపు వాతావరణాన్ని వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరం. మృణాల్ ఠాకూర్ మొదటి చిత్రం `సీతారామం`తోనే పీరియాడిక్ సినిమాలకు ఎంత చక్కగా సరిపోతుందో నిరూపించుకున్నారు. చిత్రంలోని అమ్మడి హుందాతనం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ధనుష్ చిత్రంలో 1970ల నాటి గెటప్‌లో మృణాల్ మరోసారి నటనతో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే? మృణాల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావి స్తున్నారు. గత కొంతకాలంగా ధనుష్ - మృణాల్ మధ్య వ్యక్తిగత అనుబంధంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. వారందరికీ సమాధానంలా ఇద్దరు వృత్తిపరమైన బలమైన ప్రాజెక్టుతో ముందుకు రావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చలు, లుక్ టెస్ట్‌లు కూడా పూర్తయ్యాయని సమాచారం.
ధనుష్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటూనే ఈ చిత్ర షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ సినిమాల్లో కథనం లోతుగా, సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. మహిళా పాత్రల చిత్రణలో ధనుష్ చూపే వైవిధ్యం ఈ చిత్రంలో మరింత స్పష్టంగా కనిపించనుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ కావడంతో సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్ , సంగీతంపై ధనుష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఛాన్స్ ఉంది. `మట్కా కింగ్` సినిమా పనుల్లో ధనుష్ బిజీగా ఉన్నా? ఈ ప్రాజెక్ట్ ను ధనుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. తానే స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
