ధనుష్-మృణాల్ నడుమ ఏం జరుగుతోంది?
ధనుష్ - మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి ఇంటర్నెట్ మరోసారి గుసగుసలతో వేడెక్కిస్తోంది.
By: Sivaji Kontham | 24 Nov 2025 10:03 AM ISTధనుష్ - మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం గురించి ఇంటర్నెట్ మరోసారి గుసగుసలతో వేడెక్కిస్తోంది. ఇన్‌స్టా ఎక్స్ఛేంజ్ ఈ జంట నడుమ సాగుతున్న సీక్రెట్ ఎఫైర్ గురించి ఊహాగానాలకు మరోసారి రెక్కలు తొడిగింది.
ఈ ఏడాది ఆగస్టులో ఒక సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ జంట కలుసుకున్నారు. అసలు ధనుష్ కి ఎలాంటి సంబంధం లేని ఈవెంట్లో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మృణాల్ కోసమేనా? అంటూ గుసగుస మొదలైంది. ఇది సోషల్ మీడియాలో కొత్త చర్చగా మారింది.
ఆ తర్వాత ఆ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరితో ఒకరు ఎంతో చనువుగా సంభాషించడం చర్చకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ధనుష్ - మృణాల్ మధ్య వెచ్చని ప్రేమానుబంధం బయటపడిందని నెటిజనులు ఊహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ - సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన `దో దీవానే షెహర్ మే` థీమ్ మ్యూజిక్ టీజర్‌ను మృణాల్ ఆన్ లైన్ లో షేర్ చేయగా, దాని కింద ధనుష్ చేసిన వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. ``కనిపిస్తుంది.. ధ్వనిస్తుంది`` అని ధనుష్ రాశాడు. దీనికి మృణాల్ హార్ట్, ఫ్లవర్ ఎమోజీలతో ప్రతిస్పందించింది.
ఆ ఇద్దరి నడుమా ర్యాపోకి సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఆ తర్వాత ధనుష్ , మృణాల్ మధ్య ఏదో జరుగుతోందని ఊహిస్తూ నెటిజనులు రకరకాల పోస్టులు పెట్టారు. కొందరు లవ్ ఈమోజీలతో స్పందించారు. ఆ ఇద్దరినీ తలైవా- తలైవి అంటూ కొందరు వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ప్రారంభంలో `సన్ ఆఫ్ సర్దార్ 2` ప్రీమియర్‌లో ధనుష్-మృణాల్ జంట ఒకరినొకరు ఘాడంగా కౌగిలించుకున్న వీడియో వైరల్ కాగా, డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఆ కౌగిలింత చూసాక ఈ బంధం స్నేహానికి మించి అంటూ చాలామంది నమ్మారు. మరోవైపు దో దీవానే షెహర్ మెయిన్ టీజర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ధనుష్- శ్రుతి హాసన్ నటించిన 2012 హిట్ చిత్రం 3 థీమ్ మ్యూజిక్ ని పోలి ఉందని పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ధనుష్ తదుపరి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన `తేరే ఇష్క్ మెయిన్` విడుదల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇందులో కృతి సనన్ కథానాయిక. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి విడుదల కానుంది. `సన్ ఆఫ్ సర్దార్ 2`లో చివరిసారిగా కనిపించిన మృణాల్ ఠాకూర్, దో దీవానే షెహర్ మే, డకోయిట్: ఎ లవ్ స్టోరీ తదితర చిత్రాలలో నటిస్తోంది.
