Begin typing your search above and press return to search.

మృణాల్, ఆ హీరోతో డేటింగా? నిజమెంత?

ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి

By:  M Prashanth   |   4 Aug 2025 5:46 PM IST
మృణాల్, ఆ హీరోతో డేటింగా? నిజమెంత?
X

సినీ ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు డేటింగ్ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటీవల ధనుష్.. ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను కొన్నేళ్ల క్రితం ధనుష్ వివాహం చేసుకున్నారు. 18 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడాకులు తీసుకున్నారు. వారికి యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి గోప్యంగా ఉంటారు. అయితే ఇప్పుడు మృణాల్ తో డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి.

ఇటీవల మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు వేడుకలో ధనుష్ ఆమెతో సన్నిహితంగా ఉండటం తర్వాత ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పలు పార్టీలు, మీటింగ్స్ లో కలిసి కనిపించారు. రీసెంట్ గా తన బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మే మూవీలో నటిస్తున్న ధనుష్.. కృతి సనన్, తమన్నా, మృణాల్ ఠాకూర్ తో ఓ పార్టీలో సందడి చేశారు.

మృణాల్ కు ఆ సినిమాతో సంబంధం లేకపోయినా.. పార్టీలో పాల్గొనడంతో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత ధనుష్.. మృణాల్ ఠాకూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సెలబ్రిటీ ప్రీమియర్‌ కు హాజరయ్యారు. దీంతో మృణాల్ ఠాకూర్‌ తో ధనుష్ డేటింగ్ రూమర్స్ మరింతగా ఊపందకున్నాయి. త్వరలోనే ఓపెన్ అవుతారని టాక్ వినిపిస్తోంది.

అయితే కొంతమంది పెయిర్ సూపర్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఫ్రెండ్స్ అయ్యి ఉంటారని అంటున్నారు. ఊహాగానాలు నిరాధారమైననవిగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయని అంటున్నారు. దీనిపై ఇప్పుడు ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.

కాగా, ధనుష్, మృణాల్ కెరీర్ విషయానికొస్తే.. ఇద్దరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా తమ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో వివిధ సినిమాలతో థియేటర్స్ లోకి రానున్నారు. మరి ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.