బిగ్ స్టార్స్ తో UV క్రేజీ మల్టీస్టారర్
ఇదిలా ఉండగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఆయన సోలో ఫిల్మ్ కాదు. మల్టీ స్టారర్.
By: M Prashanth | 25 Sept 2025 11:00 PM ISTసినిమా తీస్తాడు, సైలెంట్ గా వస్తాడు, హిట్ కొడతాడు, మళ్లీ ఇదే రిపీటు. ఇది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రొఫెషనల్ కెరీర్. ఆయనను యువత ఇలాగే మీమ్స్ లో ప్రశంసిస్తుంటుంది. పెద్ద పెద్ద సెట్టింగులు ఉండవ్, భారీ కాస్టింగ్ అక్కర్లేదు, ఏళ్ల తరబడి షూటుంగ్ లు ఉండవు. కేవలం కంటెంట్ ను నమ్మే ధనుష్ సినిమాలు చేస్తారు. ఈ ఫార్ములాతోనే ఆయన గత కొన్నేళ్లుగా సక్సెస్ అవుతున్నారు.
సార్, కుబేర, కెప్టెన్ మిల్లర్ ఇలా పలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆయన నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా భారీ హంగులు, గ్రాఫిక్స్ లేకుండా సింపుల్ గా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఆయన సోలో ఫిల్మ్ కాదు. మల్టీ స్టారర్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.. ఈ మల్టీస్టారర్ నిర్మించే ప్లాన్ లో వుంది. దీని కథేంటి? డైరెక్టర్ ఎవరు? అనే తదితర వివరాలు త్వరలోనే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే ధనుష్ కు తనకంటే పెద్ద హీరోలతో మల్టీ స్టారర్ చేయడం కొత్తేం కాదు. రీసెంట్ గా అక్కినేని నాగార్జునతో కుబేర సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో నాగ్ శ్వాగ్ కు ఏ మాత్రం తీసిపోకుండా ధనుష్ నటన ఉంది. ఇందులో ధనుష్ ప్రాణం పెట్టి చేశారని ఆయనపై ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో మోహన్ లాల్ తో సినిమా అంటే ఎలా ఉండనుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అలాగే బలమైన కథ ఉండడంతోనే ధనుష్ మోహన్ లాల్ తో సినిమా చేస్తున్నారమో అని కూడా అంటున్నారు.
మరోవైపు మోహన్ లాల్ ఇటీవల ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నారు. 2023 సంవత్సరానికి గానూ ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రధానం చేసింది. రీసెంట్ గా దిల్లీలో జరిగిన అవార్డుల వేడుకల్లో ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
