O.Mగా టైటిల్ మార్పు.. ధనుష్ ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ అదే!
మమ్ముట్టితో కలిసి ధనుష్ నటిస్తున్న ‘O.M’ (ఆపరేషన్ మోల్)లో ఆయన పాత్ర భిన్నంగా ఉండనుందని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. తిరుపతి అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్ కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చారట. నవంబర్ 20న విడుదల కానున్న ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ లభించింది. ఇందులో సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు.
By: Sivaji Kontham | 13 Nov 2026 10:07 PM ISTకళాకారుడికి లేదా నటుడికి ఏదైనా కొత్తదనం లేనిదే బోరింగ్! ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకం కావాలి. అప్పుడే ఏ నటుడికి అయినా ప్రత్యేకమైన గుర్తింపు. అలాంటి వైవిధ్యానికి ప్రయత్నిస్తాడు గనుకనే ధనుష్ కి జాతీయ ఉత్తమ నటుడిగా రెండుసార్లు పురస్కారాలు దక్కాయి. ఆడుకళం, అసురన్ చిత్రాల్లో అద్భుత నటనకు గాను జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఇప్పుడు మరోసారి నటన పరంగా ధనుష్ పరాకాష్ఠ చూపిస్తాడట. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లాంటి సీనియర్ తో కలిసి ధనుష్ O.M అనే ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ఎలా ఉండబోతోంది? అంటూ సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ నడుస్తోంది. తిరుపతి అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో ధనుష్ పాత్ర ఆద్యంత ఎమోషనల్ గా సాగుతుందట. కంటెంట్ కూడా విజువల్ గా కొత్తదనంతో నిండి ఉందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే అడవి నేపథ్యంలోని ఈ చిత్రంలో యాక్షన్ కంటెంట్ కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని, ధనుష్ పాత్ర ఆద్యంతం రక్తి కట్టిస్తుందని కూడా చెబుతున్నారు. ఇందులో మమ్ముట్టి లాంటి సీనియర్ నటించడంతో ఇద్దరు జాతీయ అవార్డ్ గ్రహీతల మధ్య నువ్వా నేనా? అనే ప్రదర్శన ఉంటుందని చెబుతున్నారు.
ధనుష్ గతంలో అసురన్, వడ చెన్నై, రాయన్, కర్ణన్ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ మాస్ - రస్టిక్ పాత్రలు పోషించారు. అయితే ఆ సినిమాలన్నింటికీ భిన్నంగా ఇందులో ధనుష్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇది రొటీన్ రక్తపాతం, యాక్షన్ సినిమా కాదు.. ఆధ్యాత్మిక మానవీయ కోణంలో ధనుష్ పాత్ర రక్తి కట్టిస్తుందని వెల్లడించారు.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అయితే సెన్సార్ బోర్డు సూచనలు.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్ర టైటిల్‌ను OM నుండి `O.M` (ఆపరేషన్ మోల్) గా మార్చినట్లు తాజా సెన్సార్ పోస్టర్ ద్వారా చిత్రబృందం అధికారికంగా ధృవీకరించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యుఏ సర్టిఫికెట్ లభించగా ఇందులో సాయి పల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మాగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
