నేషనల్ అవార్డ్ హీరోకి ఈ స్థాయి ఓపెనింగ్స్?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా సినిమా కర ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Sravani Lakshmi Srungarapu | 30 April 2026 1:26 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా సినిమా కర ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా ధనుష్ సినిమాలకు ఉండే ఓపెనింగ్ బజ్ ఈసారి కనిపించకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కంటెంట్ సెలెక్షన్, త యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని నేషనల్ అవార్డ్ అందుకున్న ఈ స్టార్ హీరోకి కూడా ఓపెనింగ్స్ గ్యారంటీ కాదనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ధనుష్ గత సినిమా ఇడ్లీ కడై రిలీజ్‌కు ముందు 24 గంటల్లోనే భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదవగా, కర మాత్రం ఆ స్థాయికి సగం కూడా చేరుకోలేకపోయింది. ఇది కేవలం ఒక సినిమా పరంగా కాకుండా, స్టార్ పవర్‌పై ఉన్న సంప్రదాయ నమ్మకాలను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో ఒకప్పుడు హీరో పేరు చాలు ఓపెనింగ్స్‌కు అని భావించిన ఆడియన్స్ ధోరణి మారుతోందా అనే చర్చ కూడా మొదలైంది.
మరోవైపు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతున్నప్పటికీ, పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ కాలేకపోవడం గమనార్హం. సాధారణంగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అంటే ఎక్స్‌ట్రా హైప్ ఏర్పడాలి. కానీ కర విషయంలో అది కనిపించకపోవడం ప్రమోషన్స్ విషయంలో జరిగిన లోపమా అనే అనుమానం కూడా రేకెత్తుతుంది. మిగిలిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చిత్ర యూనిట్ నుంచి పెద్దగా ప్రమోషనల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ధనుష్ లాంటి టాలెంటెడ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఉన్నప్పటికీ, ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో కేవలం పేరు సరిపోదని ఈ ట్రెండ్ సూచిస్తోంది. కంటెంట్, ప్రమోషన్, సోషల్ మీడియా హైప్.. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే ఓపెనింగ్స్ బలంగా వస్తాయనే కొత్త రియాలిటీని కర సినిమా మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ డే కలెక్షన్స్‌పైనే నిలిచింది. ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ట్రేడ్ వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
