ఇడ్లీ కొట్టు.. ధనుష్ వల్ల మాత్రమే సాధ్యం..!
స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ధనుష్ చేసే సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ఎలాంటి కథకు అయినా సరిపోయేలా తన ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు.
By: Ramesh Boddu | 21 Sept 2025 10:12 AM ISTస్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ధనుష్ చేసే సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ఎలాంటి కథకు అయినా సరిపోయేలా తన ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు. అటు కమర్షియల్ సినిమా అయినా సరే ఇటు ఎమోషనల్ సెన్సిటివ్ సినిమా అయినా సరే ధనుష్ తనను తాను మార్చుకునే విధానం ఇంప్రెస్ చేస్తుంది. ఇక అతని డైరెక్షన్ లో వచ్చే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. రెండేళ్ల క్రితం రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా డైరెక్ట్ చేసిన ధనుష్ లేటెస్ట్ గా ఇడ్లీ కొట్టు సినిమా తీశాడు. ఆ సినిమా అక్టోబర్ 1న రిలీజ్ కాబోతుంది.
ఇడ్లీ కొట్టు ట్రైలర్..
ఇడ్లీ కొట్టు ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సినిమా దాదాపు అర్ధమవుతుంది. ఒక పెద్ద రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేసే హీరో.. ఆ హోటల్ లాభాలకు కారణం అవుతాడు. ఆ హోటల్ యజమాని అతన్ని పొగిడినా అతని కొడుకు మాత్రం అతన్ని పనోడని అవమానిస్తాడు. ఆ టైం లో తన ఊరిలో తండ్రి పెట్టిన ఇడ్లీ కొట్టు గుర్తుకొస్తుంది. ఇంటికి వెళ్లి దాన్ని మళ్లీ ఓపెన్ చేసి సక్సెస్ అవుతాడు.
ఐతే హీరో పనిచేసే రెస్టారెంట్ ఓనర్ కొడుకు హీరోని డిస్ట్రబ్ చేస్తుంటాడు. హీరోని టార్గెట్ చేసిన అతనికి హీరో ఎలా ఆన్సర్ ఇచ్చాడు అన్నది సినిమా కథ. ట్రైలర్ చూస్తేనే ఇదొక మంచి ఎమోషనల్ మూవీగా అనిపిస్తుంది. ధనుష్ పర్ఫెక్ట్ గా అన్ని కుదిరేలా చేసుకున్నాడు. అరుణ్ విజయ్, నిత్యా మీనన్, సత్యరాజ్ పాత్రలు సినిమాలో బలంగా మారనున్నాయి.
రాయన్ తో కాన్ఫిడెన్స్..
ధనుష్ ఆల్రెడీ కుబేరతో ఈ ఇయర్ సక్సెస్ అందుకున్నాడు. ఈసారి ఇడ్లీ కొట్టు అని మరో ఎమోషనల్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాను డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ కలిసి నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 1న వస్తున్న ఇడ్లీ కొట్టు ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
ధనుష్ నుంచి వస్తున్న మరో మంచి మూవీగా ఇడ్లీ కొట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన ధనుష్ ఎలాంటి సినిమా తీస్తే వాళ్లు ఇంప్రెస్ అవుతారన్నది బాగా తెలుసుకున్నాడు. హీరోగా చేస్తూ డైరెక్షన్ చేయడం చాలా రిస్క్. అయినా కూడా అందులో కూడా సక్సెస్ అవుతున్నాడు. రాయన్ సినిమా అతనికి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. జాబిలమ్మ నీకు అంత కోపమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చింది. ఐతే ఇడ్లీ కొట్టు మాత్రం ధనుష్ చాలా ఇష్టపడి చేసిన సినిమాగా అనిపిస్తుంది.
దసరా బరిలో సెప్టెంబర్ 25న ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ అక్టోబర్ 2న కాంతారా ప్రీక్వెల్ సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఎమోషనల్ రైడ్ గా ఇడ్లీ కొట్టు వస్తుంది. మరి ఈ రెండిటి మధ్య పోటీలో ఇడ్లీ కొట్టు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
