Begin typing your search above and press return to search.

రికార్డు ధరకు ధనుష్ 'ఇడ్లీ కొట్టు'

ఈ క్రమంలో చింతపల్లి రామారావు ఆధ్వర్యంలోని శ్రీ వేదాక్షర మూవీస్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. దాదాపు 6 కోట్ల రూపాయల డీల్‌తో, ఇది ధనుష్ కెరీర్‌లోనే తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ప్రైస్‌గా నిలిచింది.

By:  M Prashanth   |   14 Sept 2025 7:24 PM IST
రికార్డు ధరకు ధనుష్ ఇడ్లీ కొట్టు
X

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనాన్ని హైలెట్ చేస్తుంటాడు. ఇక అతను దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇడ్లీ కొట్టు. ఇప్పటికే కుబేరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక అదే ఫామ్‌ను కొనసాగిస్తూ, కుటుంబ కథాంశంతో కూడిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఇడ్లీ కొట్టు సినిమాను సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. జివి ప్రకాష్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేశాయి. అలాగే తెలుగులో ఈ సినిమాకి భారీ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ధనుష్‌కి ఇక్కడున్న బలమైన మార్కెట్ కారణంగా, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం నిర్మాతల మధ్య పోటీ నెలకొంది.

ఈ క్రమంలో చింతపల్లి రామారావు ఆధ్వర్యంలోని శ్రీ వేదాక్షర మూవీస్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. దాదాపు 6 కోట్ల రూపాయల డీల్‌తో, ఇది ధనుష్ కెరీర్‌లోనే తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ప్రైస్‌గా నిలిచింది. రామారావు మాట్లాడుతూ, ఇడ్లీ కొట్టు సినిమాను అక్టోబర్ 1న తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

ధనుష్‌కి ఇక్కడున్న క్రేజ్, జివి ప్రకాష్ మ్యూజిక్ కలిస్తే పెద్ద ఓపెనింగ్ ఖాయమని భావిస్తున్నాం. ప్రమోషన్స్ కూడా పెద్ద స్థాయిలో జరిపి సినిమాని మాస్ ఆడియన్స్‌కి దగ్గర చేస్తాం.. అని అన్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అరుణ్ విజయ్, శాలినీ పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కుటుంబం, విలేజ్ ఎమోషన్‌లతోపాటు ధనుష్ స్టైల్‌లో యాక్షన్, మ్యూజిక్ కలగలిపి ప్యాకేజ్ చేసిన సినిమా అని యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా ధనుష్ ఈసారి కూడా హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా తన సత్తా చూపించబోతున్నాడు. డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు.

లోకల్ కల్చర్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, ధనుష్ రియలిస్టిక్ స్టైల్‌లో ఈ సినిమా తెరకెక్కించారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సింపుల్ అయినప్పటికీ హృదయాన్ని తాకేలా ఉన్నాయి. మొత్తానికి ఇడ్లీ కొట్టు సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. రికార్డ్ స్థాయిలో హక్కులు అమ్ముడైన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అక్టోబర్ 1న థియేటర్స్‌లో సినిమా రన్ ఎలా ఉంటుందో చూడాలి.