డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధనుష్ ఇడ్లీ కొట్టు!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోయింది. అందుకే థియేటర్లలో విడుదలైన చిత్రాలు 4 వారాలకే ఇటు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.
By: Madhu Reddy | 29 Oct 2025 12:50 PM ISTకరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోయింది. అందుకే థియేటర్లలో విడుదలైన చిత్రాలు 4 వారాలకే ఇటు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. మరికొన్ని ఓటీటీలో నేరుగా విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అంతేకాదు పెరిగిన టికెట్ ధరలు, స్నాక్స్, కుటుంబంతో కలిసి సినిమా చూడలేక చాలామంది మధ్య, చిన్న తరగతి కుటుంబ సభ్యులు ఓటీటీలోనే ఎక్కువగా కుటుంబంతో కలిసి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వివిధ రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా పుట్టుకొస్తున్నాయి.
అలా ఇప్పటికే చాలా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని చిత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే ఈలోపే ఇప్పుడు మళ్లీ ఒక చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అదే ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీ. తమిళంలో ' ఇడ్లీ కొట్టు' పేరుతో అక్టోబర్ 1న విడుదలైన ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో రిలీజ్ చేశారు. ధనుష్ నటుడిగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తిరు సినిమా వచ్చి ఏకంగా జాతీయ అవార్డును కూడా అందించింది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం సీరియల్ లా సాగింది అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తమిళ్, తెలుగు, హిందీ సహ అనేక భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థియేటర్లలో మిస్ అయిన వాళ్లందరికీ ఓటీటీ లో చూసే అవకాశం లభించింది. ఇకపోతే తెలుగులో థియేటర్లో టీవీ సీరియల్ లా సాగిందనే కామెంట్లు వ్యక్తం అవ్వగా.. మరి ఓటీటీ లో ఎలాంటి స్పందన దక్కించుకుంటుందో చూడాలి.
ఇడ్లీ కడై సినిమా స్టోరీ విషయానికి వస్తే.. శివ కేశవులు (రాజ్ కిరణ్) సొంత ఊరైన శంకరాపురంలో ఇడ్లీ కొట్టు అనే ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటాడు. తండ్రి కలలను కొనసాగించాలని కొడుకు మురళీ (ధనుష్) హోటల్ మేనేజ్మెంట్ చదివి, విదేశాలలో ఒక మంచి ఉద్యోగం పొందుతాడు. బ్యాంకాక్ లో పనిచేసే సమయంలోనే ఆ కంపెనీ అధినేత (సత్యరాజ్) కూతురు మీరా (షాలిని పాండే)తో ప్రేమలో పడతాడు. ఇక పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో తండ్రి ఆకస్మిక మరణంతో ఇండియాకి వస్తాడు మురళీ. ఆ తర్వాత మురళీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. తండ్రి కలలను నెరవేర్చడానికి అతడు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? కుటుంబాన్ని కాదని ప్రేమికుడి కోసం ఇండియాకి వచ్చిన మీరా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? చివరికి మురళీను పెళ్లి చేసుకుందా? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
