ధనుష్ అడిగినా అందుకే ఆ పాత్ర చేయలేదు
రాయన్ సినిమాలో ధనుష్, తన తమ్ముడి పాత్రలో నటించమని ఓ సారి తనను అడిగాడని, కానీ ఆ పాత్ర ధనుష్ ను మోసం చేసే పాత్ర కావడంతో తాను దాన్ని చేయకూడదనుకున్నానని చెప్పారు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2025 3:00 AM ISTతమిళ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ఇడ్లీ కడై. నిత్య మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా ఇడ్లీ కడై మూవీ ఆడియో లాంచ్ జరగ్గా ఆ ఈవెంట్ కు చిత్ర యూనిట్ మొత్తం హాజరైంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ లో జీవీ ప్రకాష్, ధనుష్ తో తనకున్న బాండింగ్ ను బయటపెట్టారు.
ధనుష్ ను మోసం చేయలేను
రాయన్ సినిమాలో ధనుష్, తన తమ్ముడి పాత్రలో నటించమని ఓ సారి తనను అడిగాడని, కానీ ఆ పాత్ర ధనుష్ ను మోసం చేసే పాత్ర కావడంతో తాను దాన్ని చేయకూడదనుకున్నానని చెప్పారు. యాక్టింగ్ కోసమైనా సరే ధనుష్ ను తాను మోసం చేయలేనని జీవీ ప్రకాష్ చెప్పడంతో వారిద్దరి మధ్య ఎంత గొప్ప అనుబంధముందో అందరికీ వెల్లడైంది.
అదే ఈవెంట్ లో ధనుష్ జీవీ ప్రకాష్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. జీవీ ప్రకాష్ కేవలం రీల్స్ కోసమో లేదంటే ట్రెండ్స్ కోసమో కాకుండా చాలా ప్యాషన్ తో మ్యూజిక్ ను కంపోజ్ చేస్తారని, ఆయన మ్యూజిక్ అందించిన ఎన్నో సాంగ్స్ ఆడియన్స్ మనసుల్లో పాతుకుపోయాయని, ఎంజామీ తందానే, ఎన్న సుగం లాంటి సాంగ్స్ జీవీ పని తనాన్ని అందరికీ తెలిసేలా చేసాయన్నారు.
జీవీ లాంటి సీనియర్ మ్యూజికర్ డైరెక్టర్లు ఎంతోమంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లకు మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ను కలిగించారని, వారిని స్పూర్తిగా తీసుకుని మరెంతో మంది ఇండస్ట్రీలోకి రావడం ఆనందాన్నిస్తుందని ధనుష్ చెప్పారు. డాన్ పిక్చర్స్, వుండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో షాలినీ పాండే, అరుణ్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది.
