Begin typing your search above and press return to search.

ధ‌నుష్ టైటిల్‌ని ఖూనీ చేసేస్తున్నార‌ట‌!

ధ‌నుష్ చేస్తున్న క్రేజీ సినిమాల్లో `క‌ర‌` ఒక‌టి. విఘ్నేష్ రాజా ద‌ర్శ‌కుడు. `పోర్ తొళిల్` మూవీతో మంచి పేరు తెచ్చ‌కున్న విఘ్నేష్ రాజా ఈ మూవీని తెర‌కెక్కించాడు.

By:  Ravindar Gorantla   |   29 April 2026 6:56 PM IST
ధ‌నుష్ టైటిల్‌ని ఖూనీ చేసేస్తున్నార‌ట‌!
X

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ హీరోగా, డైరెక్ట‌ర్‌గా విభిన్న‌మైన సినిమాల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. గ‌త ఏడాది త‌మిళంలో న‌టించి డైరెక్ట్ చేసి `ఇడ్లీ క‌డాయ్‌`, తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేసిన `కుబేర‌`లో న‌టించిన ధ‌నుష్ అదే ఏడాది హిందీలో ఆనంద్ ఎల్‌. రాయ్ రూపొందించిన `తేరే ఇష్క్ మే` అంటూ సంద‌డి చేశారు. ఈ ఏడాది మూడు క్రేజీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. వీటితో పాటు మ‌రో హాలీవుడ్ సినిమాలోనూ ఈ ఏడాది ధ‌నుష్ చిన్న అతిథి పాత్ర‌లో మెరిసే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ధ‌నుష్ చేస్తున్న క్రేజీ సినిమాల్లో `క‌ర‌` ఒక‌టి. విఘ్నేష్ రాజా ద‌ర్శ‌కుడు. `పోర్ తొళిల్` మూవీతో మంచి పేరు తెచ్చ‌కున్న విఘ్నేష్ రాజా ఈ మూవీని తెర‌కెక్కించాడు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. కె.ఎస్‌. ర‌వికుమార్‌, జ‌య‌రామ్‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, క‌రుణాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. బ్యాంక్ రాబ‌రీలు త‌ప్ప మ‌రో ప‌ని చేయ‌డం చేత కానీ ఓ యువ‌కుడి నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ఈ సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌లో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

విభిన్న‌మైన క‌థ‌ని, పాత్ర‌ల‌ని ఎంచుకుని సినిమాలు చేస్తున్న ధ‌నుష్ `క‌ర‌`కు కూడా అదే త‌ర‌హా క‌థ‌ని ఎంచుకుని చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోంది. అయితే ఈ మ‌ధ్య త‌మిళ టైటిల్స్‌ని తెలుగులోనూ ర‌జ‌నీకాంత్ `వెట్ట‌యాన్‌` నుంచి కంటిన్యూ చేస్తున్న విష‌యం తెలిసిందే. ధ‌నుష్ `క‌ర‌` టైటిల్‌ని కూడా అలాగే కంటిన్యూ చేస్తూ తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. అయితే టైటిల్ విష‌యంలో ధ‌నుష్‌ని టీమ్ విసిగిస్తున్నార‌ట‌.

`క‌ర‌` టైటిల్‌ని ఖూనీ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని హీరో ధనుష్ స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం. సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో రీసెంట్‌గా టీమ్ హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించింది. ఇందులో పాల్గొన్న హీరో ధ‌నుష్ `క‌ర‌` టైటిల్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `క‌ర‌` టైటిల్ నాకు ఒక మిస్ట‌రీ. ఫోర్ ఆల్ఫాబెట్స్‌. కెఏఆర్ ఏ` కానీ అంద‌రూ రాంగ్‌గా ప‌లుకుతున్నారు.

క‌రా..కారా..కొంత మంది మాత్ర‌మే `క‌ర‌` అని ప‌లుకుతున్నారు. హీరోయిన్ కూడా `క‌రా` అంటోంది. మా ప్రొడ్యూస‌ర్ కూడా క‌రా అనే ప‌లుకుతున్నారు.. జ‌స్ట్ క‌ర అంతే..మీరు ఎలా అయినా ప‌ల‌కండి కానీ థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమా మాత్రం చూడండి` అని ధ‌నుష్ ఆడియ‌న్స్‌ని కోరారు. ధ‌నుష్ `క‌ర‌`టైటిల్‌ని త‌న టీమే ఎలా ఖూనీ చేస్తున్నారో చెప్పి న‌వ్వించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.