ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?
ధనుష్ కథల ఎంపికపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘త్రీ’, ‘రఘువరన్ బీటెక్’, ‘వడ చెన్నై’, ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల కమర్షియల్ యాక్షన్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ బలమైన కథలను ఎంచుకుంటే విజయాలు అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
By: Gopi Velupala | 21 Nov 2026 3:29 PM ISTసినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి మూవీస్ పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. హీరోలకు పెద్ద సంఖ్య లో ప్రేక్షకాదరణ దక్కుతుంది. వాళ్ళు స్టార్ హీరోలుగా పరిగణిస్తారు. మరి కొంతమంది నటులు ఆర్ట్, ప్రయోగాత్మకమైన మూవీస్ చేసిన కూడా ప్రేక్షకుల నుంచి వాళ్లకి పూర్తి స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. ధనుష్ లాంటి నటుడు కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు కానీ ఆయన భారీ సక్సెస్ కొట్టలేకపోతున్నాడు.
ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోయిందా?
ఇండస్ట్రీ లో కమర్షియల్ సినిమాలకి దక్కే ఆదరణ ఇతర సినిమాలకు దక్కడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే యాక్షన్ సినిమాలతో వచ్చిన వాళ్ళు మాత్రమే టాప్ హీరోలుగా మారుతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాలను చేసినా కూడా టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు ధనుష్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించాడు. అతని నుంచి ఒక సినిమా వస్తుందంటే అందులో కొత్త పాయింట్ ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగేది. ఆయన స్టోరీ సెలెక్షన్ అలా ఉండేది. ప్రస్తుతం తన నుంచి సినిమాలు వస్తున్నప్పటికి ఆయన కూడా పూర్తిగా కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తూ ఆయన సినిమాల్లో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని డిజైన్ చేస్తున్నారు. కథని పక్కన పెట్టి యాక్షన్ ఎలిమెంట్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసినప్పుడు సినిమాలోని కోర్ ఎమోషన్ కి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ధనుష్ సినిమాల పరిస్థితి కూడా అలాగే మారింది.
అప్పట్లో ధనుష్ నుంచి వచ్చిన మూవీస్...
ఒకప్పుడు ఆయన నుంచి త్రి, రఘువరన్ బీటెక్, వడ చెన్నై, అసురన్, కర్ణన్ లాంటి సినిమాలు వచ్చాయి. అవన్నీ కంటెంట్ పరంగా అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. అందులో తను ఒదిగిపోయి నటించి నటుడిగా తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చే సినిమాల్లో కంటెంట్ పెద్దగా ఎఫెక్టివ్ గా ఉండడం లేదు. దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే దర్శకులు సైతం తన లోని పూర్తిస్థాయి నటుడిని వాడుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోతున్నారు. తద్వారా ఆయన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేక, కంటెంట్ బేస్డ్ సినిమాలు గా మారలేక అటు ఇటు కాకుండా పోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా వచ్చిన OM సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ కథ ఆధారంగా తెరకెక్కింది. ఇంతకు ముందు పుష్ప సినిమా ఇదే పాయింట్ తో వచ్చింది.
రియల్ ఇన్సిడెంట్ తో కూడిన ఫిక్షనల్ కథ తో సినిమాను తెరకెక్కించారు. అది కూడా ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ చేయలేదనే చెప్పాలి. ధనుష్ గతంలో మాదిరిగా మంచి కథలను సెలెక్ట్ చేసుకొని తనలోని వైవిధ్యమైన నటుడిని బయటికి తీస్తే తనకి గొప్ప విజయాలు దక్కుతాయి. పాన్ ఇండియా స్టార్ హీరోగా సత్తా చాటుకునే అవకాశం కూడా తనకు దక్కేదని మరి కొంతమంది సినీ విమర్శకులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు...
