మళ్లీ యాంటీ ఫ్యాన్స్ కు దొరికిన ధనుష్
ఆయన ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడితే ఆయన్ని ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ధనుష్ తండ్రి కార్తీక్ రాజా సీనియర్ డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలుసు.
By: Sravani Lakshmi Srungarapu | 16 Sept 2025 1:00 AM ISTఅందరూ అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి కొందరు నచ్చితే, ఇంకొందరికి మరికొందరు నచ్చుతుంటారు. ఎవరి ఇష్టం వారిది. దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. అందులో భాగంగానే హీరోలకు ఫ్యాన్స్ ఉన్నట్టే యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటుంటారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆ హీరోను విమర్శించడానికి ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూస్తుంటారు.
ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలానే యాంటీఫ్యాన్స్ కు దొరికిపోయారు. ధనుష్ కు సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగానే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడితే ఆయన్ని ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ధనుష్ తండ్రి కార్తీక్ రాజా సీనియర్ డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలుసు. డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ధనుష్, తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానని చెప్పడాన్ని యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు.
ఇడ్లీ కొట్టుతో ఉన్న ఎమోషన్ తోనే సినిమా తీశా రీసెంట్ గా ధనుష్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడై ఆడియో లాంచ్ లో తాను చిన్నప్పుడు చాలా కష్టపడ్డానని, చిన్నగా ఉన్నప్పుడు తనకు ప్రతీ రోజూ ఇడ్లీ తినాలనిపించేదని, కానీ దానికి సరిపోయే డబ్బులు తన వద్ద ఉండేవి కావని, ఇప్పుడు స్టార్ హోటల్స్ లో తింటున్నా ఆ రుచి, ఆనందం దక్కడం లేదని, చిన్నప్పుడు ఇడ్లీ కొట్టుతో తనకున్న ఎమోషన్‌నే తాను ఇలా సినిమాగా తీశానని ధనుష్ తన స్పీచ్ లో భాగంగా చెప్పారు.
ధనుష్ స్పీచ్ విన్న యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా డ్యూటీ ఎక్కి అతన్ని టార్గెట్ చేస్తున్నారు. ధనుష్ చిన్నప్పుడే అతని తండ్రి కార్తీక్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్ అని, ధనుష్ కావాలని సింపతీ కోసమే ఇదంతా చేస్తున్నారని, ఎప్పటికప్పుడు ఇలా కొత్త కొత్తవి చెప్పడం ధనుష్ కు అలవాటేనని అంటుంటే, ధనుష్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో చెప్పింది కరెక్టేనని అంటున్నారు.
