మాజీ భార్య ఐశ్వర్యపై ధనుష్ వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య దంపతులు తాము విడిపోతున్నట్టు 2022లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 29 Sept 2025 10:23 AM ISTతమిళ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య దంపతులు తాము విడిపోతున్నట్టు 2022లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024లోవారికి విడాకులు మంజూరయ్యాయి. 18 ఏళ్ల సంసార బంధాన్ని విడిచిపెట్టి ఎవరికి వారు సపరేట్ అయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు యాత్ర - లింగా ఉన్నారు. విడాకులకు చాలా కాలం ముందు ధనుష్ పలు ఇంటర్వ్యూలలో తన అప్పటి భార్య ఐశ్వర్య గురించి ప్రేమగా మాట్లాడాడు. అందుకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో మరోసారి వైరల్ గా మారుతోంది. అతడు ఐశ్వర్యను ఆమె తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోల్చాడు.
ఐశ్వర్య రజనీకాంత్ లో ఏం నచ్చింది? మిమ్మల్ని అమితంగా ఆకర్షించినది ఏమిటి? రజనీకాంత్ కుమార్తె కాబట్టి పెళ్లాడారా? అన్న ప్రశ్నకు సమాధానంగా, ఆమె వ్యక్తిత్వం నచ్చిందని అన్నాడు. రజనీకాంత్ కుమార్తె అని కాదు.. ఆమె వ్యక్తిత్వం నచ్చడం వల్లనే పోళ్లాడానని తెలిపాడు. తన సింప్లిసిటీ ఇష్టమని తెలిపాడు. సౌందర్య తండ్రి రజనీకాంత్ ఎంతో సింపుల్ గా ఉంటారు. ఐశ్వర్య తన తండ్రి కంటే 100 రెట్లు సింపుల్‌గా ఉంటుంది. ఐశ్వర్య అందరినీ సమానంగా చూస్తుంది.. ఎవరితోనైనా స్నేహం చేయగలదు. పిల్లలను చాలా బాగా పెంచుతుంది! అని తెలిపాడు.
ధనుష్- ఐశ్వర్య జంట సౌతిండియా పవర్ కపుల్ గా పాపులరయ్యారు. ధనుష్ తన మామ రజనీకాంత్ పై గొప్ప అభిమానం కురిపిస్తారు. రజనీ కాంత్ సైతం ధనుష్ ప్రతిభ, పనితీరుపై బహిరంగంగా అభిమానించారు. ఈ జంటకు 2006లో వారి మొదటి సంతానం యాత్ర, తరువాత 2010లో రెండవ కుమారుడు లింగా జన్మించారు. 2022 నుంచి ఐశ్వర్య- ధనుష్ మధ్య విభేధాలున్నాయి. 2024లో అధికారికంగా విడాకులు తీసుకోవడానికి ముందు వారిని కలిపి ఉంచేందుకు రజనీకాంత్ విశ్వప్రయత్నాలు చేసారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ధనుష్ నటించిన `కుభేర` ఇటీవల విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి ధనుష్ వరుసగా ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తున్నారు. ధనుష్ నటించిన `ఇడ్లి కడై` అక్టోబర్ -1న విడుదల కానుంది.
