Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారా?

‘రాంఝనా’, ‘అత్రంగీ రే’, ‘తేరే ఇష్క్ మే’ తర్వాత ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ నాలుగోసారి కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. ఈసారి రొమాంటిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారని, భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. 2027 మధ్యలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి.

By:  Srikanth Kontham   |   27 Nov 2026 8:00 PM IST
ఆ ఇద్ద‌రు డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నారా?
X

హిట్ కాంబినేష‌న్ కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఒక్క ప్లాప్ లేని క‌ల‌యిక అయితే అంచ‌నాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్- ధనుష్ విషయంలోనూ సరిగ్గా అదే జరుగుతోంది. ఇప్పటికే ఇద్ద‌రి కలయికలో వచ్చిన మూడు సినిమాలు ఎలాంటి విజ‌యం సాధించాయో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా నాల్గ‌వ‌ ప్రాజెక్ట్‌తో మళ్లీ జతకడుతున్నారు. 2027 లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ వైపే అడుగులు వేస్తున్నారా? అన్న చర్చ ఇండస్ట్రీలో మొద‌లైంది.

గతంలో `రాంఝనా`, `అత్రంగీ రే`, `తేరే ఇష్క్ మే` వంటి చిత్రాలకు కలిసి పని చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలు ఇచ్చిన ఊపుతోనే నాల్గ‌వ సారి చేతులు కలిపేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఈసారి ఓ రొమాంటిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటి వ‌ర‌కూ ఈ జోడీ చేసిన సినిమాల్లో ఎమోషన్స్.. ప్రేమ కథలే ప్రధానంగా కనిపించేవి. కానీ తాజా సినిమాలో రొమాన్స్‌తో పాటు భారీ ఫైట్లు.. హై-స్కేల్ స్టంట్ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. గత కాలాన్ని తలపిం చేలా భారీ సెట్స్ న‌డుమ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌నే విజువల్ లాంగ్వేజ్‌లో కీలకంగా వాడుకోబోతున్నారట.

ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ ల‌కు ఈ తరహా పీరియాడిక్ యాక్షన్ జోనర్ కొత్తదే. గతంలో కలిసి చేసిన సినిమాల కంటే పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే కథను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త జోనర్‌లో ఈ ద్వ‌యం వేసే అడుగులు ఎలా ఉంటాయని అభిమానులు అంత‌కంత‌కు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 2027 మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

అప్పటిలోపు కథా చర్చలు ప్రీ-ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గనుక విజ‌యం సాధిస్తే మ‌ళ్లీ ఇదే జోడీ రిపీట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రో రెండు సినిమాలు చేసి విజ‌యం అందుకుంటే? ఇద్ద‌రి కెరీర్ లో డ‌బుల్ హ్యాట్రిక్ న‌మోద‌వుతుంది. ప్ర‌స్తుతం ఆనంద్ కొత్త సినిమా ప‌నుల్లోనే నిమ‌గ్న‌మైన‌ట్లు తెలుస్తోంది. అలాగే ధ‌నుష్ కమిట్ అయిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేసే వ‌ర‌కూ ధ‌నుష్ కూడా స‌మ‌యం ఇవ్వ‌లేరు.