ధనుష్ 'అమరన్'.. బుట్ట బొమ్మకు ఛాన్స్..?
రాజ్ కుమార్ ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడు.. కుబేర, ఇడ్లీ కొట్టు తర్వాత ధనుష్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న విషయంపై ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.
By: Ramesh Boddu | 3 Nov 2025 4:00 PM ISTకోలీవుడ్ స్టార్ ధనుష్ రీసెంట్ గా ఇడ్లీ కొట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే ఆ సినిమా రిజల్ట్ ఊహించినట్టుగా అయితే రాలేదు. ఇక నెక్స్ట్ ధనుష్ చేసే సినిమాపై కోలీవుడ్ లో క్రేజీ అప్డేట్ వచ్చింది. ధనుష్ 55వ సినిమాగా ఒక క్రేజీ డైరెక్టర్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. అమరన్ తో లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి తో ధనుష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ధనుష్ 55వ సినిమాగా ఇది వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్దే నటిస్తుంది.
కాంచన 4 తో పాటు జన నాయగన్ లో..
కోలీవుడ్ లో పూజా హెగ్దే వరుస ఆఫర్లు అందుకుంటుంది. తెలుగులో ఆమెకు సరైన ఛాన్స్ లు లేకపోయినా కూడా తమిళ మేకర్స్ మాత్రం ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంచన 4 తో పాటు జన నాయగన్ లో నటిస్తున్న పూజా హెగ్దేకి ధనుష్ సినిమా ఆఫర్ కూడా మంచి బూస్టింగ్ ఇస్తుంది. డైరెక్టర్ రాజ్ కుమార్ అమరన్ తోనే తన ప్రత్యేకమైన శైలి చూపించారు.
ఒక దేశభక్తి కథను.. వీర జవాన్ స్టోరీతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం అన్నది అంత ఈజీ థింగ్ కాదు. ఈ విషయంలో రాజ్ కుమార్ ప్రతిభని మెచ్చుకోవాలి. శివ కార్తికేయన్ తో అమరన్ తీసి వెంటనే ధనుష్ సినిమా ఛాన్స్ పట్టేశాడు రాజ్ కుమార్. ఐతే ధనుష్ కూడా వర్సటైల్ యాక్టర్ అతనితో కూడా ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ధనుష్ తో పూజా హెగ్దే జోడీ కడుతుండటంతో బుట్ట బొమ్మ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అని చెప్పొచ్చు.
రాజ్ కుమార్ ధనుష్ తో..
రాజ్ కుమార్ ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడు.. కుబేర, ఇడ్లీ కొట్టు తర్వాత ధనుష్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న విషయంపై ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. అమరన్ తర్వాత ఈ కథ మీద ఏడాది పాటు పనిచేసిన రాజ్ కుమార్ ఫైనల్ గా త్వరలో ధనుష్ సినిమా స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా అమరన్ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా దాన్ని మించి వర్క్ అవుట్ అవుతుందా అన్నది చూడాలి.
ధనుష్ తో సినిమా అంటే ఇటు తెలుగులో కూడా మార్కెట్ బాగుంటుంది. ఆల్రెడీ తెలుగు దర్శకులతో కూడా మరో సినిమా చేసేలా ధనుష్ డిస్కషన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే ఆ ప్రాజెక్ట్ విషయాలు త్వరలో తెలుస్తాయి. ఐతే రాజ్ కుమార్ సినిమాతో మాత్రం ధనుష్ మరోసారి తన వర్సటాలిటీ చూపించేలా చేస్తున్నాడని తెలుస్తుంది. ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా పై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
