Begin typing your search above and press return to search.

కథ నచ్చినా.. రెమ్యునరేషన్ దగ్గర ట్విస్ట్ ఇచ్చిన హీరో?

స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని అంటుతున్న ఈ టైమ్‌లో, ధనుష్ వంటి తమిళ స్టార్ హీరోలు కూడా తెలుగు మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.

By:  M Prashanth   |   8 Oct 2025 10:06 AM IST
కథ నచ్చినా.. రెమ్యునరేషన్ దగ్గర ట్విస్ట్ ఇచ్చిన హీరో?
X

టాలీవుడ్‌లో రెమ్యునరేషన్ల హీట్ మామూలుగా లేదు. స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్ని అంటుతున్న ఈ టైమ్‌లో, ధనుష్ వంటి తమిళ స్టార్ హీరోలు కూడా తెలుగు మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తన యాక్టింగ్, టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎప్పుడో అట్రాక్ట్ చేసిన ధనుష్ గురించి తాజాగా వచ్చిన న్యూస్.. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురి చేసింది.

ఏకంగా 50 కోట్ల డిమాండ్ చేశాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ​ధనుష్ కు తెలుగులో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే, జగమే తందిరం, మారన్, కెప్టెన్ మిల్లర్ వంటి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ అంతగా ఆడలేదు. కానీ, డైరెక్ట్ తెలుగు సినిమా 'సర్' మాత్రం ఊహించని స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఇటీవల విడుదలైన మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా 'కుబేర' కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి డీసెంట్ హిట్‌గా నిలిచింది.

ఈ సక్సెస్ ట్రెండ్‌తోనే ఇప్పుడు ఇతను రేటు పెంచేశాడనే వార్త వినిపిస్తోంది. ​రీసెంట్‌గా తెలుగుకి చెందిన ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంబినేషన్ కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి ధనుష్‌ను కలిసింది. కథ విన్నాక, సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వాళ్ళు ఆశించని నెంబర్‌ను డిమాండ్ చేశాడట.

తన తమిళ మార్కెట్ పేమెంట్ కంటే చాలా ఎక్కువ మొత్తం కావాలని అడిగాడని ఇండస్ట్రీలో గట్టి బజ్ ఉంది. ​సాధారణంగా, తమిళ సినిమాల కోసం ధనుష్ సుమారు 35 కోట్లు తీసుకుంటున్నాడు. కానీ, స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలంటే ఏకంగా 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఈ 15 కోట్ల అదనపు డిమాండ్‌కి కేవలం థియేట్రికల్ సక్సెస్ మాత్రమే కాదు, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక కారణం అని అంటున్నారు.

తెలుగులో సినిమాలు చేస్తే వచ్చే ఓటీటీ, శాటిలైట్ హక్కుల విలువ పెరగడంతో, దాన్ని లెక్కలోకి తీసుకుని రేటు పెంచినట్లు టాక్. ​'సర్' 'కుబేర' సినిమాలు తెలుగులో డీసెంట్‌గా ఆడటంతో, ధనుష్ తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే, పెద్ద తెలుగు ప్రొడ్యూసర్లు ఈ రేటుకి ఓకే చెబితే, నెక్స్ట్ సినిమాతో తన మార్కెట్‌ను ₹50 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లాలనేది ఇతని స్ట్రాటజీగా కనిపిస్తోంది. ఈ భారీ పారితోషికం కారణంగానే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాంబినేషన్ కాస్త ఆలోచనలో పడిందని సమాచారం. మరి ఈ రేటుకి ప్రొడ్యూసర్లు ఒప్పుకుంటారా, లేక వేరే హీరోతో ముందుకెళ్తారా అనేది త్వరలో తెలుస్తుంది.